జరిమానా విధించిన ఎస్సైపై పగ.. చివరకు అతను ఎంతకు తెగించాడంటే..

ABN , First Publish Date - 2022-04-24T17:23:20+05:30 IST

మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసులు దొరికిపోయాడు.

జరిమానా విధించిన ఎస్సైపై పగ.. చివరకు అతను ఎంతకు తెగించాడంటే..

మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసులు దొరికిపోయాడు.. మహిళా పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించాడు.. దీంతో మహిళా ఎస్సై అతనికి దేహశుద్ధి చేసి జరిమానా విధించారు.. దీంతో ఆ మహిళా ఎస్సైపై వాహనదారుడు కక్ష కట్టాడు.. ఆమెను వెంటాడాడు. భద్రతా విధుల్లో ఉన్న ఆమెను చంపేందుకు పథకం వేశాడు.. గొంతు కోసి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు.. ప్రస్తుతం ఆ ఎస్సై ప్రాణాపాయ స్థితిలో ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నారు.. తమిళనాడు సీఎం ఆమెను పరామర్శించారు.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా సుత్తమల్లి పోలీస్‌ స్టేషన్‌లో మార్గెడ్‌ థెరిసా ఎస్సైగా పనిచేస్తున్నారు. గత నెలలో ఆర్ముగం అనే వ్యక్తి మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయాడు. మద్యం మత్తులో మహిళా పోలీసులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాంతో ఎస్సై థెరిసా అతడికి దేహశుద్ధి చేశారు. జరిమానా విధించారు. దీంతో ఆమెపై ఆర్ముగం కక్ష కట్టాడు. ఆమెను మట్టుబెట్టేందుకు పథకం వేశాడు. శుక్రవారం రాత్రి పలవూరు గ్రామంలో జరిగిన ఆలయ ఉత్సవాల భద్రతకు ఎస్సై థెరిసా వెళ్లారు. రాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఆమెపై ఆర్ముగం దాడి చేశాడు. కత్తితో గొంతు  కొసి పారిపోయే ప్రయత్నం చేశాడు. విధుల్లో ఉన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఎస్సై థెరిసాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తిరునల్వేలిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ఆర్ముగంపై రెండు సెక్షన్లతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం స్టాలిన్‌ ఎస్‌ఐ థెరిసాను ఫోన్‌ ద్వారా పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. రూ. ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియోను ప్రకటించారు. 

Read more