Prank Video: తల్లిని భయపెట్టేందుకు కూతురు ఏం చేసిందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-11-11T18:32:05+05:30 IST

ఇంటర్నెట్‌లో ఎప్పటికప్పుడు కుప్పతెప్పలుగా ప్రాంక్ వీడియోలు వచ్చి పడుతుంటాయి. చాలా వీడియోలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. అలాంటిదే ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Prank Video: తల్లిని భయపెట్టేందుకు కూతురు ఏం చేసిందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్‌లో ఎప్పటికప్పుడు కుప్పతెప్పలుగా ప్రాంక్ వీడియోలు వచ్చి పడుతుంటాయి. చాలా వీడియోలు మనల్ని ఆకట్టుకుంటుంటాయి. అలాంటిదే ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యువతి తన తల్లిని భయపెట్టేందుకు ప్రాంక్ ప్లే చేసింది. అది ప్రాంక్ అని తెలియక తల్లి నిజంగానే భయపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఒక మహిళ సోఫాలో కూర్చుని ల్యాప్‌టాప్‌పై పని చేసుకుంటోంది. ఆ గదిలో నేలపై ఓ బొమ్మ బాతు ఉండడాన్ని చూసింది. కొద్ది సేపటి తర్వాత నెమ్మదిగా ఆ బొమ్మ కదలింది. దీంతో ఆ మహిళ ఆ బొమ్మనే గమనించడం ప్రారంభించింది. రెండు మూడు సార్లు నెమ్మదిగా ఆ బొమ్మ కదిలిన తర్వాత ఆ మహిళ దానినే తదేకంగా చూడడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా ఆ బొమ్మ బాతు చాలా వేగంగా ముందుకు కదలింది. దీంతో ఆ మహిళ అదిరిపడి సోఫాలో నుంచి కింద పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Updated Date - 2022-11-11T18:34:46+05:30 IST