Water Diet: నీళ్లు, నిమ్మరసంతోనే జీవనం.. 41 ఏళ్లుగా ఆహారానికి దూరంగా ఉంటున్న మహిళ!

ABN , First Publish Date - 2022-09-28T21:05:34+05:30 IST

ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రజలు రకరకాల ఆహార పదార్థాలు తీసుకుని జీవిస్తుంటారు.

Water Diet: నీళ్లు, నిమ్మరసంతోనే జీవనం.. 41 ఏళ్లుగా ఆహారానికి దూరంగా ఉంటున్న మహిళ!

ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన ప్రజలు రకరకాల ఆహార పదార్థాలు తీసుకుని జీవిస్తుంటారు. ఆహారం లేకుండా మాత్రం ఎవరూ జీవించలేరు. అయితే వియత్నాంకు (Vietnam) చెందిన ఓ మహిళ గత 41 ఏళ్లుగా ఆహారం తీసుకోవడం లేదు. కేవలం నీళ్లు, నిమ్మరసం మాత్రం తీసుకుని జీవనం సాగిస్తోంది. 41 సంవత్సరాలుగా తాను ఎలాంటి ఆహారాన్నీ తీసుకోలేదని, నీటికి కొన్ని పదార్థాలు కలిపి తాగుతున్నానని (Woman Living on Water Diet) ఆ మహిళ తెలిపింది. దానికి కారణం ఆమె ఓ అరుదైన వ్యాధితో బాధపడడమే.


ఇది కూడా చదవండి..

Karnataka: మరో మూడు రోజులే గడువు.. రూ.60 వేల జరిమానా కట్టాల్సిందేనంటూ ఒత్తిడి.. ఇంతకీ ఆ దళిత కుటుంబం చేసిన తప్పేంటంటే!


వియత్నాంకు చెందిన మిస్ న్గోన్ (Ms. Ngon) అనే మహిళ వయస్సు 63 సంవత్సరాలు. 21 సంవత్సరాల వయస్సు వరకు, ఆమె మిగిలిన అందరి లాగానే ఘనాహారాన్ని తిసుకునేది. అయితే 22 ఏళ్ల వయస్సులో ఆమెకు ఉదర సంబంధిత సమస్యలు, కళ్ళు మసకబారడం ప్రారంభమయ్యాయి. రక్త సంబంధిత (blood disease) ఎలర్జీతో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఎన్ని మందులు వాడినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. ఒక డాక్టర్ సలమాతో ఆమె పూర్తిగా ఘనాహారం తీసుకోవడం మానేసి ద్రవాలతో కడుపు నింపుకోవడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది.


ఘనాహారం తనకు సరిపడడం లేదని గుర్తించిన Ngon అప్పటినుంచి పూర్తిగా ద్రవాహారానికే పరిమితమైంది. కేవలం నీరు, చక్కెర, నిమ్మరసంతోనే (lemonade ) ఆమె జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం ఆమె వయస్సు 63 సంవత్సరాలు. ఆమె తన వయస్సుకు తగినట్లుగా ఆరోగ్యంగానే కనిపిస్తోంది. ఆమెలో శక్తి లోపము, అనారోగ్య లక్షణాలు కనిపించడం లేదు.

Updated Date - 2022-09-28T21:05:34+05:30 IST