ఈ డ్రెస్ వేసుకుని ఫోజులిస్తూ.. లక్షలు సంపాదిస్తున్న మహిళ..! ఆమెను చూస్తే..

ABN , First Publish Date - 2022-09-09T03:30:02+05:30 IST

నెలకు లక్షల్లో సంపాదించాలంటే.. పెద్ద చదువులు చదివి గొప్ప ఉద్యోగమో లేదా భారీ వ్యాపారమో చేయాలి.. కానీ అలాంటిదేమీ లేకుండా ప్రజల ఊహాప్రపంచానికి అనుగుణంగా డ్రెస్ వేసుకునే ఓ మహిళ ప్రస్తుతం లక్షలు సంపాదిస్తోంది.

ఈ డ్రెస్ వేసుకుని ఫోజులిస్తూ.. లక్షలు సంపాదిస్తున్న మహిళ..! ఆమెను చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: నెలకు లక్షల్లో సంపాదించాలంటే.. పెద్ద చదువులు చదివి గొప్ప ఉద్యోగమో లేదా భారీ వ్యాపారమో చేయాలి.. కానీ అలాంటిదేమీ లేకుండా ప్రజల ఊహాప్రపంచానికి అనుగుణంగా డ్రెస్ వేసుకునే ఓ మహిళ ప్రస్తుతం లక్షలు సంపాదిస్తోంది. ఫొటోలకు ఫోజులిస్తూ భారీగా డబ్బు వెనకేసుకుంటోంది. నెలకు ఆరు లక్షలకు పైగా డబ్బు సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇంతకీ ఎవరా యువతి.. ఏమిటా డ్రెస్ అంటారా అయితే.. ఈ కథనం మీకోసమే.


ఎమిలీ అలెక్సాండ్రా..ఓ ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్.. టిక్‌టాక్‌లో(Tiktok) ఆమెకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. కారణం.. ఆమె అప్పుడప్పుడూ జలకన్యలా(Mermaid) దుస్తులు ధరించిన ఫొటోలు వీడియోలు షేర్ చేయడమే. చిన్నప్పటి నుంచి ఆమెకు జలకన్యలా అవ్వాలనేది ఓ కోరిక. కార్టూన్లు చూసి ఆమె జలకన్య పాత్రపై మక్కువ పెంచుకుంది. ఆ తరువాత ఇప్పుడు అదే ఆమెకు ఆదాయ వనరుగా మారింది. ఇలాంటి డ్రెస్ వేసుకుని ఆమె నేలకు ఆరు లక్షలకు పైగానే సంపాదిస్తోంది. ప్రముఖ స్టార్ హోటళ్లుతో పాటూ కొన్ని స్విమ్మింగ్ పూల్స్ కూడా ఆమెను మెర్‌మెయిడ్ దుస్తులు ధరించి ఈతకొట్టమని చెబుతుంటాయి. 


తన జీవితం ఆనందంగా గడిచిపోతోందా అంటే అవుననే సమాధానమిస్తుంది ఎమిలీ. అయితే.. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంది. అయితే..ఇదంతా ఆమె ఎప్పుడో లైట్ తీసుకుంది. ఈ సోషల్ మీడియా జమానాలో ట్రోలింగ్‌కు గురికాని వారు ఎవరుంటారు అని ఒక్కముక్కలో తేల్చేసింది ఎమిలీ. అయితే ఎమిలీ ఫాలోవర్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మెర్‌మెయిడ్ దుస్తులు ధరించి ఆమె ఎప్పుడు ఫొటోలు పెట్టినా వారు వాటిని విపరీతంగా వైరల్ చేస్తారు. 

Read more