Viral Video: వృద్ధుడైన మామగారిపై కోడలి దాడి.. పోలీసుల సమక్షంలోనే చెంపదెబ్బలు.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-09-06T21:05:43+05:30 IST

ఆమె ఢిల్లీ (Delhi) పోలీస్ విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తోంది.. ఆమెకు 2020లో వివాహం జరిగింది.

Viral Video: వృద్ధుడైన మామగారిపై కోడలి దాడి.. పోలీసుల సమక్షంలోనే చెంపదెబ్బలు.. వీడియో వైరల్

ఆమె ఢిల్లీ (Delhi) పోలీస్ విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తోంది.. ఆమెకు 2020లో వివాహం జరిగింది.. నాలుగు నెలలు కూడా గడవక ముందే భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది.. ఆదివారం ఉదయం తన తల్లితో కలిసి అత్తింటికి వెళ్లింది.. ఇంట్లో ఉన్న మామతో గొడవ పడింది.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత మామపై ఆమె దాడికి దిగింది.. పోలీసుల సమక్షంలోనే చెంపదెబ్బలు (Cop Slaps Father-In-law) కొట్టింది.. ఆ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: గుండెపోటుతో డాక్టర్ ఎదురుగానే కుప్ప కూలిన వ్యక్తి.. అతడిని డాక్టర్ ఎలా కాపాడారంటే..


విజేందర్ గుప్తా (66) అనే వ్యక్తి తన 62 ఏళ్ల భార్య వీణాతో కలిసి ఢిల్లీలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. విజేందర్ గుప్తా కోడలు చంచల్ ఢిల్లీ పోలీస్‌ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె 2020లో విజేందర్ తనయుడు అంకుర్ గుప్తాను వివాహం చేసుకుంది. పెళ్లై నాలుగు నెలలు కూడా గడవకముందే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం తన తల్లితో కలిసి అత్తింటికి వెళ్లింది. ఇంట్లో ఉన్న అత్తమామలపై కేకలు వేసింది. దీంతో విజేందర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


పోలీసుల సమక్షంలోనే మామపై చంచల్ దాడికి దిగింది. మామను వరుసగా చెంపదెబ్బలు కొట్టింది. ఆ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఇప్పటి వరకు నిందితురాలిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

Read more