విషం ఇచ్చి భర్తను చంపిన భార్య.. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని నివ్వెరపోయిన పోలీసులు..!

ABN , First Publish Date - 2022-10-05T21:16:14+05:30 IST

ఆ యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లి తర్వాత కూడా ఆ యువతి ఎక్కువగా పుట్టింట్లోనే ఉండేది..

విషం ఇచ్చి భర్తను చంపిన భార్య.. విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని నివ్వెరపోయిన పోలీసులు..!

ఆ యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లి తర్వాత కూడా ఆ యువతి ఎక్కువగా పుట్టింట్లోనే ఉండేది.. తల్లిదండ్రులు బలవంతంగా పంపించినా ఏదో వంకతో పుట్టింటికి చేరిపోయేది.. భర్త వచ్చి బలవంతంగా తీసుకెళ్తే వెళ్లేది.. నాలుగు నెలల క్రితం భర్తకు విషం పెట్టి చంపేసి పరారైపోయింది.. చివరకు పోలీసులకు దొరికిపోయి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Madhya Pradesh: రెవెన్యూ అధికారి అహంకారం.. గ్రామస్థుడి భుజంపై కాలు వేసి జులుం.. చివరకు ఏమైందంటే..


బిజ్నోర్‌కు చెందిన యశ్‌పాల్ (35) జూన్ 16వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి మెడపై, మొహంపై గాయాల గుర్తులు కనిపించాయి. ఇంట్లో ఉండాల్సిన అతడి భార్య కవిత ఆచూకీ ఎక్కడా దొరకలేదు. యశ్‌పాల్ విషాహారం తిని మరణించాడని పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. అతడి భార్య కవితపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కోసం నాలుగు నెలల పాటు గాలించిన పోలీసులు చివరకు పట్టుకున్నారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


వివాహానికి ముందు నుంచే తనకు వినీత్ అనే వ్యక్తితో లవ్ అఫైర్ ఉందని, తన తల్లిదండ్రులు బలవంతంగా యశ్‌పాల్‌కు ఇచ్చి పెళ్లి చేశారని కవిత చెప్పింది. తన ప్రేమ గురించి భర్తకు కూడా చెప్పి తనను వదిలేయమన్నానని, కానీ, అతడు తన మాట వినలేదని తెలిపింది. ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్లిపోయినా బలవంతంగా తనను తిరిగి తీసుకెళ్లేవాడని, అందుకే అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ప్రియుడు వినీత్‌తో కలిసి భర్త‌ను చంపేశానని కవిత పోలీసుల ఎదుట అంగీకరించింది. 

Read more