ఆమె ఫోన్‌ను ఒక దొంగ లాక్కుని పారిపోయాడు... ఇంతలో ఆమె స్మార్ట్‌వాచ్‌కు మెసేజ్...తరువాత జరిగిందిదే...

ABN , First Publish Date - 2022-10-06T16:21:08+05:30 IST

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఆమె ఫోన్‌ను ఒక దొంగ లాక్కుని పారిపోయాడు... ఇంతలో ఆమె స్మార్ట్‌వాచ్‌కు మెసేజ్...తరువాత జరిగిందిదే...

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇది మనకు స్మార్ట్ వాచ్ ఎంతగా ఉపయోగపడుతుందో తెలియజేస్తుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ధరించిన స్మార్ట్ వాచ్.. మాయమైన ఆమె మొబైల్ ఫోన్ ఆచూకీ చెప్పింది. ఓ దొంగ ఆ మహిళ చేతిలో నుంచి ఫోన్ లాక్కున్ని పారిపోయాడు, అయితే ఆమె ధరించిన స్మార్ట్ వాచ్ ఆ దొంగను పట్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతం ఆగస్టు 28న చోటుచేసుకుంది. 


దీనిపై లేటుగా ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆ మహిళ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నది. ఆగస్టు 28న ఆమె కిరాణా సామాను కోసం సెక్టార్ 23లో మార్కెట్‌కి వెళ్లారు. ఆమె డబ్బు చెల్లించేందుకు మొబైల్‌ఫోను బయటకు తీశారు. అదే సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి ఆమె చేతిలోని ఫోన్ లాక్కొని పారిపోయాడు. ఆ మహిళ అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఆమె ఫోన్ ఆమె ధరించిన స్మార్ట్ వాచ్‌కి కనెక్ట్ అయివుంది. దీంతో ఆమె స్మార్ట్ వాచ్‌కు మెసేజ్ వచ్చింది. ఒక వ్యక్తి బైక్ మీద కూర్చుని ఫోన్ పట్టుకోవడాన్ని ఆమె గమనించింది. దీంతో అప్రమత్తమైన ఆమె అతని చేతిలో నుంచి తన ఫోను లాక్కుంది. అయితే ఇంతలో ఆ దొంగ పారిపోయాడు. కాగా నిందితుడు ఆమె ఫోన్‌తో రూ.50,856 మేరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని పోలీసు అధికారి తెలిపారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. Read more