పనికి వెళదామంటూ పిలిచిన భర్త.. ఆరోగ్యం సరిగాలేదన్న భార్య.. సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే..

ABN , First Publish Date - 2022-11-16T21:08:49+05:30 IST

ఉపాధి నిమిత్తం పొట్టచేతపట్టుకుని ఊరు విడిచి వెళ్లారు. భార్యా, పిల్లలను సంతోషంగా చూసుకోవాల్సిన భర్త.. బాధ్యతలు మరచి ప్రవర్తించాడు. నిత్యం ఏదో ఒక విషయంలో ఆమెతో గొడవ పడేవాడు. భార్య పని చేస్తుంటే ఫుల్‌గా తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో..

పనికి వెళదామంటూ పిలిచిన భర్త.. ఆరోగ్యం సరిగాలేదన్న భార్య.. సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

ఉపాధి నిమిత్తం పొట్టచేతపట్టుకుని ఊరు విడిచి వెళ్లారు. భార్యా, పిల్లలను సంతోషంగా చూసుకోవాల్సిన భర్త.. బాధ్యతలు మరచి ప్రవర్తించాడు. నిత్యం ఏదో ఒక విషయంలో ఆమెతో గొడవ పడేవాడు. భార్య పని చేస్తుంటే ఫుల్‌గా తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్యను పనికి వెళదాం.. అని పిలిచాడు. దీంతో ఆరోగ్యం సరిగా లేదని భార్య ఇంటి వద్దే ఉండిపోయింది. పనికి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి.. విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వివాహానంతరం భర్తను దూరం పెట్టిన వధువు.. మూడో రోజు హనీమూన్‌లో భార్య ముసుగు తీసి చూడగా..

భర్తపై కోపంతో ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో సహా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా తాడేపల్లిగూడెం కొండ్రుప్రోలు శివారు కేఎస్‌ఎన్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన బండారు నాగరాజు, భార్య సీతారాములు (25), కుమార్తె హేమశ్రీ (3), పది మంది కూలీలతో కలిసి తాడేపల్లిగూడెంలో డ్రెయిన్‌ పనులు చేసేందుకు వచ్చారు. వీరంతా కేఎస్‌ఎన్‌ కాలనీలో ఉంటున్నారు. నాగరాజు పనికి సరిగా వెళ్లడం లేదని, తాను పనిచేస్తుంటే తాగి తందనాలు ఆడుతున్నాడని మంగళవారం భార్య మందలించింది.

మూడో పెళ్లికి సిద్ధమైన మహిళను.. బైకులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో హెల్మెట్ పట్టుకోమని చెప్పి..

ఈ విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. బుధవారం తెల్లవారుజామున భర్త పనికి వెళదామని భార్యను పిలిచాడు. కాని ఆమె, తనకు ఆరోగ్యం సరిగా లేదని, పనికి రాలేనని చెప్పి పంపించింది. వారంతా పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి కుమార్తెతో సహా భార్య ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని (suicide)వేళాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ సత్యనారాయణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాను చనిపోయినా తన బిడ్డను సరిగా చూడడని భావించి చిన్నారి సహా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

భర్త కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు.. ఆకలికి తట్టుకోలేక బయటికి వెళ్లిన తల్లీకూతుళ్లు.. అనుకోని విధంగా..

Updated Date - 2022-11-16T21:08:49+05:30 IST

Read more