Husband Salary: ఎన్నిసార్లు అడిగినా జీతం ఎంతో చెప్పకుండా తప్పించుకుంటున్న భర్త.. విసుగొచ్చి ఆ భార్య చేసిన పనికి అంతా షాక్..!

ABN , First Publish Date - 2022-10-06T21:09:31+05:30 IST

చాలా మంది వ్యక్తులు తమ సంపాదన వివరాలను తమ జీవిత భాగస్వాములతో పంచుకోరు.

Husband Salary: ఎన్నిసార్లు అడిగినా జీతం ఎంతో చెప్పకుండా తప్పించుకుంటున్న భర్త.. విసుగొచ్చి ఆ భార్య చేసిన పనికి అంతా షాక్..!

చాలా మంది వ్యక్తులు తమ సంపాదన వివరాలను తమ జీవిత భాగస్వాములతో పంచుకోరు. భార్యలు ఎంతగా అడిగినా తమ జీతం గురించి చెప్పరు. ఢిల్లీకి చెందిన సంజు గుప్తా అనే మహిళకు కూడా ఆమె భర్త తన జీతం గురించి చెప్పలేదు. అయితే ఆమె మిగతా వారిలా ఊరుకోలేదు. తన భర్త జీత భత్యాల గురించి తెలుసుకునేందుకు ఏకంగా ఆర్టీఐ (RTI)కు దరఖాస్తు చేసుకుంది. తన భర్త ఎప్పుడూ తన జీతం గురించి సరైన సమాచారం చెప్పడం లేదని, తన భర్తకు సంబంధించిన ఆదాయ వివరాలు స్పష్టంగా కావాలని అప్లికేషన్‌లో ఆమె పేర్కొంది.


ఇది కూడా చదవండి..

World's Oldest Dog: ప్రపంచంలోనే వృద్ధ శునకం మృతి.. దాని వయసెంతంటే..


సంజు గుప్తా దరఖాస్తు చేసుకున్నప్పటికీ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CPIO), ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం అధికారులు ఆ వివరాలు తెలియజేయడానికి నిరాకరించారు. ఎందుకంటే సంజు భర్త తన జీతం గురించి వెల్లడించడానికి అంగీకరించకపోవడంతోనే అధికారులు ఆ వివరాలు అందించలేదు. అయినా సంజు గుప్తా ఆగలేదు. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ (FAA) నుంచి సాయం కోరింది. ఎఫ్ఏఏ కూడా సీపీఐఓనే సమర్థించింది. దీంతో సంజు దాంతో కేంద్ర సమాచార కమిషన్‌ (CIC)ను ఆశ్రయించింది. 


వివిధ సందర్భాల్లో సుప్రీం కోర్టు, హైకోర్టులు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకున్న సీఐసీ 15 రోజుల్లోగా సంజూ గుప్తాకు ఆమె భర్తకు సంబంధించిన ఆదాయం వివరాలను అందజేయాలని ఆదేశించింది. మొత్తానికి సంజుగుప్తా పట్టుబట్టి తను అనుకున్నది సాధించారు. ఇంతకీ సంజు గుప్తా తన భర్త జీతం వివరాలను ఇలా ఎందుకు అడగాల్సి వచ్చిందో అనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఆదాయ వివరాలను వెల్లడించడానికి భర్త నిరాకరిస్తే... ఇతర మార్గాల ద్వారా భార్య ఆ వివరాలను పొందవచ్చని సంజు నిరూపించారు.

Updated Date - 2022-10-06T21:09:31+05:30 IST