శునకాలు రోజులో 12 గంటల పాటు నిద్రపోవడం వెనుక కారణమిదే...

ABN , First Publish Date - 2022-07-04T15:53:33+05:30 IST

శునకాలు ఎంత చురుగ్గా ఉంటాయో నిద్ర విషయంలోనూ...

శునకాలు రోజులో 12 గంటల పాటు నిద్రపోవడం వెనుక కారణమిదే...

శునకాలు ఎంత చురుగ్గా ఉంటాయో నిద్ర విషయంలోనూ అవి అంతే సమయాన్ని కేటాయిస్తాయి. అవి ఎందుకు అలా ప్రవర్తిసాయనే దానిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. నిజానికి శునకాలు 24 గంటలలో 12 గంటలపాటు నిద్రలో గడుపుతాయి. అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ నికోలస్ డాడ్మాన్ శునకాల తీరుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మెదడు పగటిపూట ఎక్కువసేపు పనిచేస్తుంది. ఈ ప్రభావం వాటి శరీరంపై కనిపిస్తుంది. 


అయితే శునకాలకు దీర్ఘ నిద్ర అనేది వాటికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అవి నిద్రించే సమయంలో వాటి మెదడు జ్ఞాపకశక్తిని పెంపొందించుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. అవి మనుషుల మాదిరిగా తగినంతగా నిద్రపోకపోతే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మరోవైపు కుక్కలు ఆందోళనతో పోరాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అవి ఎక్కువ సమయం నిద్రపోతాయని నిపుణులు గుర్తించారు. మొత్తంగా చూస్తే శునకాలు తమ శరీరానికి ఉపశమనం కలిగించడం కోసమే అంతసేపు నిద్రపోతాయని తేలింది. 

Updated Date - 2022-07-04T15:53:33+05:30 IST