Viral Video: చిలుక ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. నిద్రపోతున్న శునకాన్ని లేపడానికి ఈ చిలుక ఏం చేసిందో చూడండి..

ABN , First Publish Date - 2022-09-25T01:29:58+05:30 IST

రామ చిలుకలు అత్యంత అందమైన పక్షులే కాదు.. చాలా తెలివైనవి కూడా.

Viral Video: చిలుక ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. నిద్రపోతున్న శునకాన్ని లేపడానికి ఈ చిలుక ఏం చేసిందో చూడండి..

రామ చిలుకలు అత్యంత అందమైన పక్షులే కాదు.. చాలా తెలివైనవి కూడా. అవి మనుషులును, ఇతర జంతువులను అనుకరిస్తూ మిమిక్రీ కూడా చేయగలవు. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియోలో (Viral Video) తెల్ల చిలుక (White Parrot) కుక్క గొంతును అనుకరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 


ఆ వీడియోలో ఒక కుక్క తన బెడ్ మీద హాయిగా నిద్రపోతోంది. దానిని లేపడానికి తెల్ల చిలుక చాలా ప్రయత్నించింది. చివరకు ఆ చిలుక `భౌ.. భౌ..` అని కుక్కలా మొరగడం (Parrot Barks Like A Dog) మొదలు పెట్టింది. మనుషుల స్వరాలను అనుకరించే చిలుకలనే చాలా మంది చూసి ఉంటారు. అయితే, ఈ చిలుక  కుక్కలా మొరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ చిలుక ట్యాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. 

Read more