-
-
Home » Prathyekam » While some were scuba diving an unexpected incident took place at the bottom of the sea kjr spl-MRGS-Prathyekam
-
Viral Video: స్కూబా డైవింగ్ చేస్తుండగా.. సముద్రం అడుగున అనూహ్య ఘటన.. వారి టైం బాగుండి సరిపోయింది...
ABN , First Publish Date - 2022-07-23T02:46:35+05:30 IST
వివిధ రకాల విన్యాసాలు చేస్తున్న సమయంలో ఒక్కోసారి అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు చిన్న విన్యాసాలు కూడా చివరికి వికటిస్తుంటాయి. మరికొన్ని...

వివిధ రకాల విన్యాసాలు చేస్తున్న సమయంలో ఒక్కోసారి అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు చిన్న విన్యాసాలు కూడా చివరికి వికటిస్తుంటాయి. మరికొన్ని సార్లు పెద్ద పెద్ద విన్యాసాలను కూడా కొందరు సునాయాసంగా చేసేస్తుంటారు. ఇంకొన్నిసార్లు ఇలాంటి సమయాల్లో అదృష్టవశాత్తు ప్రమాదాలు త్రుటిలో తప్పుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు స్కూబా డైవింగ్ చేస్తుండగా సముద్రం అడుగున అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయితే అతడి అదృష్టం బాగుండడంతో ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కొందరు వ్యక్తులు సముద్రంలో స్కూబా డైవింగ్ చేస్తుంటారు. సముద్రం అడుగున ఓ వైపు డైవింగ్ చేస్తూ.. మరో వైపు కెమెరాతో చిత్రీకరిస్తూ ఉంటారు. ఈ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద అనకొండ అటుగా వస్తుంది. దాన్ని చూడగానే ఆ సమయంలో ఎవరికైనా ఎక్కడలేని భయం వేస్తుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం దాని సమీపానికి వెళ్లి.. వీడియో తీస్తాడు. అయితే ఆ అనకొండ ప్రశాంతంగా ఉండడంతో అక్కడున్న వారికి ఎలాంటి హానీ చేయదు. దీంతో వారు చాలా సేపు దాన్ని చుట్టే తిరుగుతూ వీడియో తీస్తుంటారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ సూచనలు చేస్తున్నారు.
Viral Video: పెళ్లిలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేసి చూసి.. సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా దాచిన వరుడు.. వధువు రియాక్షన్ చూస్తే..
