అర్ధరాత్రి ఇంటి నుంచి మహిళ అరుపులు.. గోడ దూకి పారిపోయిన యువకుడిని చూసిన స్థానికులు.. కంగారుగా గదిలోకి వెళ్లి చూడగా..

ABN , First Publish Date - 2022-05-25T00:44:13+05:30 IST

మహిళ ఒంటరిగా కనిపిస్తే వక్రదృష్టితో చూసే రోజులివి. ఏమాత్రం అవకాశం దొరికినా అత్యాచారం, హత్యలకు తెగబడుతున్నారు. కొందరు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తుంటే.. మరికొందరు ప్రేమ పేరుతో..

అర్ధరాత్రి ఇంటి నుంచి మహిళ అరుపులు.. గోడ దూకి పారిపోయిన యువకుడిని చూసిన స్థానికులు.. కంగారుగా గదిలోకి వెళ్లి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

మహిళ ఒంటరిగా కనిపిస్తే వక్రదృష్టితో చూసే రోజులివి. ఏమాత్రం అవకాశం దొరికినా అత్యాచారం, హత్యలకు తెగబడుతున్నారు. కొందరు మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తుంటే.. మరికొందరు ప్రేమ పేరుతో వెంటపడుతూ వేధించడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో నుంచి మహిళ అరుపులు వినిపించాయి. కాసేపటికి ఓ యువకుడు గోడ దూకి పారిపోయాడు. స్థానికులు కంగారుగా వెళ్లి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ రాష్ట్రం థానా షాపూర్ పరిధిలోని ప్రాంతంలో ఓ మహిళ నివాసం ఉంటోంది. సమీప ప్రాంతానికి చెందిన రణధీర్ సింగ్ అనే యువకుడు ఈమెను కొన్నాళ్లుగా గమనిస్తున్నాడు. ఎలాగైనా ఆమెను తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు ఇంట్లో మహిళ ఒక్కటే ఉందని తెలుసుకున్నాడు. అర్ధరాత్రి ఆమె గదిలోకి వెళ్లి, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న మహిళ.. గట్టిగా కేకలు పెట్టింది.

కూతురు ఎదుటే తండ్రి చేసిన నిర్వాకం.. జరిగిన ఘటన గురించి బాలిక చెప్పింది విని అంతా షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..


దీంతో ఆమెను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఎవరో వస్తున్నట్లు గుర్తించిన యువకుడు గోడ దూకి పారిపోయాడు. స్థానికులు కంగారుగా లోపలికి వెళ్లగా మహిళ గాయాలతో పడి ఉంది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఇంటికి రండి పెళ్లి చేస్తామన్న యువతి తల్లిదండ్రులు.. అయితే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కూతురు.. ఏమంటోందంటే..

Read more