Viral news: ఈ పులి తెలివి చూడండి.. 30 అడుగుల బావిలో పడ్డా.. తనను తాను ఎలా రక్షించుకుందో..

ABN , First Publish Date - 2022-08-28T22:19:05+05:30 IST

అటవీ సమీప గ్రామాల్లోకి తరచూ వివిధ రకాల జంతువులు (Animals) చొరబడుతుంటాయి. ఈ క్రమంలో పలువురు వాటి దాడికి గురవడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు జంతువులే ప్రాణాపాయ..

Viral news: ఈ పులి తెలివి చూడండి.. 30 అడుగుల బావిలో పడ్డా.. తనను తాను ఎలా రక్షించుకుందో..

అటవీ సమీప గ్రామాల్లోకి తరచూ వివిధ రకాల జంతువులు (Animals) చొరబడుతుంటాయి. ఈ క్రమంలో పలువురు వాటి దాడికి గురవడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు జంతువులే ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంటాయి. మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ చిరుత విషయంలో ఇలాగే జరిగింది. అటవీ సమీప ప్రాంతంలోకి చొరబడిన ఓ చిరుత.. చివరకు 30అడుగుల లోతు బావిలో పడిపోయింది. రాత్రంతా అది అలాగే ఉండిపోయింది. పొద్దున అటుగా వెళ్లి చూసిన గ్రామస్తులు చివరకు షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Social media viral videos) అవుతున్నాయి.


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం సావ్లియాఖేడి పరిధి ధార్‌ అనే ప్రాంతలోని (Forest area) మాండవ్ అటవీ ప్రాంత సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం నుంచి సమీప గ్రామానికి వచ్చిన 9నెలల వయసున్న చిరుత.. ప్రమాదవశాత్తు సమీపంలోని 30అడుగుల బావిలో పడిపోయింది. అందులో సగం వరకు నీరు ఉండడంతో ఎలాంటి గాయాలూ కాలేదు. అయితే పైకి వచ్చేందుకు వీలు లేకపోవడంతో రాత్రంతా బావిలోనే ఉండిపోయింది. ఈ క్రమంలో చిరుత తన ప్రాణాలు కాపాడుకునేందుకు మనుషుల మాదిరే.. నీటిలోని పైపును పట్టుకుంది. రాత్రంతా అ పైపును పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసింది. ఉదయం గ్రామస్తులకు అనుమానం వచ్చి అటుగా వెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఇండోర్ నుంచి అటవీ శాఖ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. బావి నుంచి చిరుతను బయటికి తీసి, బోనులో బంధించారు. అనంతరం ఆటోలో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

Viral video: పిల్ల కొండముచ్చు కోసం బాలిక పోటాపోటీ.. చివరకు ఏమైందంటే..



Updated Date - 2022-08-28T22:19:05+05:30 IST