Aadhaar Cards For Dinner: పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ కార్డు ఉంటేనే విందు భోజనానికి అనుమతి..!

ABN , First Publish Date - 2022-09-27T02:25:12+05:30 IST

పెళ్లికి (Wedding) సంబంధించిన సరదా సన్నివేశాలు, వింత ఘటనలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి.

Aadhaar Cards For Dinner: పెళ్లిలో వింత కండీషన్.. ఆధార్ కార్డు ఉంటేనే విందు భోజనానికి అనుమతి..!

పెళ్లికి (Wedding) సంబంధించిన సరదా సన్నివేశాలు, వింత ఘటనలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్నాయి. రకరకాల కారణాలతో పెళ్లిళ్లు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో జరిగిన ఒక పెళ్లి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి భోజనానికి వచ్చే వాళ్లందరూ ఆధార్ కార్డులు చూపించాలని పెళ్లి వారు కండీషన్ పెట్టడమే దానికి కారణం. 


ఇది కూడా చదవండి..

Viral: వినూత్న ఆలోచన.. కేక్ మీద బయోడేటా ప్రింట్ చేసి Nike సంస్థకు పంపిన మహిళ..


యూపీలోని అమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లో తాజాగా ఒక పెళ్లి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన అక్కచెల్లెళ్ల పెళ్లిళ్లు ఒకేసారి జరిగాయి. గ్రాండ్‌గా జరుగుతున్న ఆ వివాహ వేడుకకు అంచనాలకు మించి అతిథులు హాజరయ్యారు. పిలిచిన వారి కంటే ఎక్కువ మంది వచ్చారు. దీంతో అందరికీ వసతులు, భోజనాలు సరిపోని పరిస్థితి నెలకొంది. కొందరు బయట వ్యక్తులు కూడా పెళ్ళికి వచ్చినట్లు పెళ్లివారు గుర్తించారు. దీంతో వారు ఓ కండీషన్ పెట్టారు. విందుకు హాజరయ్యే వారు తప్పకుండా ఆధార్ కార్డు చూపించాలని నిబంధన పెట్టారు. 


డైనింగ్ హాల్ డోర్ దగ్గర కొందరిని నిలబెట్టి వరుసగా ఒక్కొక్కరి ఆధార్ కార్డు (Aadhaar Cards) చెక్ చేయించారు. ఈ నిబంధన కొంత మంది బంధువులకు అవమానకరంగా తోచింది. అలా భావించిన వారు విందు భోజనం చేయకుండానే వెనుదిరిగారు.  మరికొందరు మాత్రం ఆధార్ కార్డు చూపించి మరీ భోజనం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-09-27T02:25:12+05:30 IST