9 సెకెన్ల వీడియోకి క్షణాల్లో లక్ష వ్యూస్.. అదేంటో చూస్తే మీరూ వణికిపోతారు!

ABN , First Publish Date - 2022-09-25T13:34:23+05:30 IST

సోషల్ మీడియాలో లెక్కకుమించి వీడియోలు దర్శనమిస్తుంటాయి.

9 సెకెన్ల వీడియోకి క్షణాల్లో లక్ష వ్యూస్.. అదేంటో చూస్తే మీరూ వణికిపోతారు!

సోషల్ మీడియాలో లెక్కకుమించి వీడియోలు దర్శనమిస్తుంటాయి. వాటిలోని కొన్ని వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇటువంటి వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా అటువంటి వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మొసలి, జీబ్రా కనిపిస్తున్నాయి. జీబ్రా నీటిని తాగి నది నుంచి బయటకు వస్తుంది. ఇంతలో ఒక మొసలి వేగంగా బయటకు రావడం కనిపిస్తుంది. అది జీబ్రాను వేటాడేందుకు ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ జీబ్రా బయటకు రావడం ఒక్క క్షణం లేటయినా మొసలికి బలి అయ్యేది. కొన్ని సెకెన్ల వ్యవధిలో ఆ జీబ్రా నదిలో నుంచి తన కాలిని బయటకు తీయడంతో అది బతికిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో @ipskabrak ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ అయ్యింది. 9 సెకెన్లున్న ఈ వీడియోను ఇప్పటివరకూ లక్షకుపైగా నెటిజన్లు వీక్షించారు. ఈ వీడియోను చూసినవారు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ఘటన‌ను చూసి జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవచ్చని కొందరు అంటున్నారు.

Read more