Viral Video: గర్భవతి అయిన తన తల్లిని రెండేళ్ల చిన్నారి ఎలా చూసుకుంటోందో చూడండి.. నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2022-12-06T15:52:29+05:30 IST

గర్భవతి అయిన తన తల్లికి రెండేళ్ల చిన్నారి సహాయం చేస్తూ ప్రేమగా చూసుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. తన తల్లిని ప్రేమగా చూసుకుంటున్న ఆ చిన్నారి ఇంటర్నెట్‌లో అందరి ప్రేమను పొందుతోంది.

Viral Video: గర్భవతి అయిన తన తల్లిని రెండేళ్ల చిన్నారి ఎలా చూసుకుంటోందో చూడండి.. నెటిజన్లు ఫిదా!

గర్భవతి అయిన తన తల్లికి రెండేళ్ల చిన్నారి సహాయం చేస్తూ ప్రేమగా చూసుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. తన తల్లిని ప్రేమగా చూసుకుంటున్న ఆ చిన్నారి ఇంటర్నెట్‌లో అందరి ప్రేమను పొందుతోంది. నేలపై ఏదైనా పడిపోయినప్పుడు తల్లికి సహాయం చేయడానికి ఆ చిన్నారి ఎలా పరుగెత్తుతుందో ఆ వీడియోలో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ Chrisma తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

నేను జాక్‌పాట్ కొట్టాను. నా చిన్నారి నాకు తోడుగా ఉండగా గర్భంతో ఉండడం చాలా సులభం! అని ఆమె కామెంట్ చేసి ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. 32 వారాల గర్భవతిని అయిన నేను నేల మీద పడిన వస్తువులను తీసుకోలేనని నా 2 సంవత్సరాల పాపకు తెలుసు అని టెక్ట్స్ ఉంది. అనంతరం ఆ మహిళ ఒక ప్లేట్‌ను నేల మీద పడేసింది. దూరంగా మంచం మీద కూర్చున్న పాప.. ఆ శబ్దం విని, తన అమ్మను నువ్వు పడేశావా అని అడిగింది. దానికి, ఆ మహిళ అవును అని సమాధానం చెప్పడంతో ఆ చిన్నారి నేరుగా తల్లి దగ్గరకు వెళ్లి కింద పడిన ప్లేట్ తీసి ఇచ్చింది. తల్లి పట్ల ఆ రెండేళ్ల చిన్నారి ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Updated Date - 2022-12-06T15:52:30+05:30 IST