Viral Video: ఢిల్లీ మెట్రో రైలులో యువతి డ్యాన్స్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-26T00:10:36+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది రకరకాల విన్యాసాలు చేస్తున్నారు.

Viral Video: ఢిల్లీ మెట్రో రైలులో యువతి డ్యాన్స్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో అనుచరులను పెంచుకునేందుకు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి ఢిల్లీ మెట్రో రైలులో ప్యాసింజర్ల మధ్య డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి వైరల్ చేసింది. ఆ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 


ఆ వీడియో ప్రకారం ఓ యువతి ఢిల్లీ మెట్రో రైలులో డ్యాన్స్ చేస్తుండగా మరో యువతి రికార్డు చేస్తోంది. విశేషం ఏమిటంటే.. ఆ యువతి డ్యాన్స్ చేస్తుండడాన్ని అక్కడ ఉన్న చాలా మంది ప్రయాణికులు పెద్దగా పటించుకోలేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ వీడియోను యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ యువతి కాన్ఫిడెన్స్ సూపర్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి వేషాలు అవసరమా అని మరికొందరు విమర్శిస్తున్నారు. 

Updated Date - 2022-09-26T00:10:36+05:30 IST