-
-
Home » Prathyekam » Villagers blacken teachers face for showing porn to girls In Jharkhand sgr spl-MRGS-Prathyekam
-
Jharkhand: విద్యార్థినులకు పోర్న్ వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు.. గ్రామస్థులు అతడికి ఎలా బుద్ధి చెప్పారంటే..
ABN , First Publish Date - 2022-10-01T02:24:01+05:30 IST
ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడికి సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుంటాం

ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయుడికి సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుంటాం. విద్యాబుద్ధులు నేర్పి భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందిస్తాడని ఉపాధ్యాయుడిని దైవంతో సమానంగా కొలుస్తాం. అయితే కొందరు ఆ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఉన్నత స్థానంలో ఉండి నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ఇది కూడా చదవండి..
Viral Video: అడవిలో నుంచి జనావాసం లోకి వచ్చిన సింహం.. జాగింగ్ చేస్తున్న మహిళను చూసి ఏం చేసిందంటే..
చైబాసా జిల్లాలో ఉన్న ఖాస్జమ్ ప్రభుత్వ అప్‌గ్రేడ్ మిడిల్ స్కూల్లో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఆ పాఠశాలలో చదువుకునే బాలికలతో ప్రేమ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్ బాలికలను తన ఒడిలో కూర్చోబెట్టుకుని వారికి తన మొబైల్లో ఉన్న పోర్న్ వీడియోలు చూపించేవాడు. అలాగే బాలికలు టాయిలెట్‌కు వెళ్లినపుడు అతను కూడా వెంటనే లోపలికి వెళ్లేవాడు. ఎవరైనా అభ్యంతరం చెబితే ఏదో సాకు చెప్పి వారిని కొట్టేవాడు. టీచర్ చేస్తున్న అసభ్యకర చర్యల గురించి బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో గ్రామస్థులందరూ పాఠశాల వద్దకు చేరుకున్నారు.
పాఠశాలకు వెళ్తున్న ప్రేమ్ కుమార్‌ను పట్టుకుని కొట్టారు. మొహానికి మసి పూసి, మెడలో చెప్పుల దండ వేసి కొడుతూ ఊరంతా తిప్పారు. ప్రేమ్ కుమార్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్‌కు లేఖలు అందజేశారు. ఆయన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ప్రేమ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై విద్యా శాఖ కూడా విచారణకు ఆదేశించింది.