పొలంలో చేతి పంపు నుంచి ఉబికివస్తున్న మద్యం.. ఏడు అడుగుల లోతు తవ్వి చూడగా.. షాకింగ్ సీన్..

ABN , First Publish Date - 2022-10-12T23:50:10+05:30 IST

చేతి పంపు నుంచి నీళ్లు రావడం చూశాం గానీ.. మద్యం రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. మీరే కాదు పోలీసులు కూడా షాక్ అయ్యారు.. కానీ ఇది నిజం. పొలాల్లో ఏర్పాటు చేసిన చేతి పంపు..

పొలంలో చేతి పంపు నుంచి ఉబికివస్తున్న మద్యం.. ఏడు అడుగుల లోతు తవ్వి చూడగా.. షాకింగ్ సీన్..

చేతి పంపు నుంచి నీళ్లు రావడం చూశాం గానీ.. మద్యం రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. మీరే కాదు పోలీసులు కూడా షాక్ అయ్యారు.. కానీ ఇది నిజం. పొలాల్లో ఏర్పాటు చేసిన చేతి పంపు వింతగా కనిపించడంతో దగ్గరికి వెళ్లి కొట్టి చూశారు. లోపల నుంచి గుప్పు గుప్పుమని మద్యం బయటికి రావడంతో అంతా అవాక్కయ్యారు. ఇదేంటి.. ఇదెలా సాధ్యం అనుకున్నారు. అసలు విషయం కనుక్కుందామని చేతి పంపు కింద తవ్వి చూశారు. సుమారు ఏడు అడుగుల లోతు తవ్వగా వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని గుణ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో కల్తీ మద్యం విక్రయాలు (Liquor sales) జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బృందాలుగా ఏర్పడిన పోలీసులు కల్తీ మద్యం స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ క్రమంలో తనిఖీలు చేస్తుండగా గ్రామ పరిసరాల్లోని పొలాల్లో ఓ చేతిపంపు కంటపడింది. చూడటానికి విచిత్రంగా ఉండడంతో దగ్గరికి వెళ్లి పరిశీలించారు. పంపును కొట్టి చూడగా లోపలి నుంచి మద్యం బయటికి వచ్చింది. దీంతో పోలీసులతో పాటూ అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇదేలా సాధ్యమంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. బైక్‌లో పెట్రోల్ పోయగానే ఎగిసిపడిన మంటలు.. అసలేం జరిగిందంటే..!


అసలు విషయం ఏంటో కనుక్కుందామని.. చేతి పంపు కింద తవ్వకాలు చేపట్టారు. ఏడు అడుగుల లోతు తవ్వగానే చాలా ప్లాస్టిక్ డ్రమ్ములు బయటపడ్డాయి. వాటి నిండా కల్తీ మద్యం ఉండడం చూసి షాక్ అయ్యారు. అన్నింటినీ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అయితే పోలీసుల రాక గమనించిన నిందితులు ముందుగానే అక్కడి నుంచి పరారయ్యారు. విచారణ అనంతరం కల్తీ మద్యం మాఫియాను నడుపుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు ఎనిమిది కేసులు నమోదు చేశారు. కాగా, చేతి పంపు నుంచి మద్యం బయటికి వచ్చే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్ల ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

మండుతున్నాయి కదా అని నులుముకున్న వెంటనే.. చేతిలోకి ఊడిపడిందో కన్ను.. అసలేం జరిగిందో తెలిసి నివ్వెరపోయిన జనం..Read more