Viral Video: తాళి కట్టే సమయంలో.. అందరి ముందూ వధువు చేసిన పనికి.. అంతా షాక్..

ABN , First Publish Date - 2022-11-19T21:17:49+05:30 IST

కల్యాణ మండపాల్లో చోటు చేసుకునే ఘటనలు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. కొందరు వధూవరులు వివాహ మంటపాలపై ప్రవర్తించే తీరు.. సోషల్ మీడియాలో కొన్నిసార్లు ట్రెండింగ్ అవుతుంటుంది. వరుడి ఎదుట వధువు..

Viral Video: తాళి కట్టే సమయంలో.. అందరి ముందూ వధువు చేసిన పనికి.. అంతా షాక్..

కల్యాణ మండపాల్లో చోటు చేసుకునే ఘటనలు కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. కొందరు వధూవరులు వివాహ మంటపాలపై ప్రవర్తించే తీరు.. సోషల్ మీడియాలో కొన్నిసార్లు ట్రెండింగ్ అవుతుంటుంది. వరుడి ఎదుట వధువు డ్యాన్స్ చేయడం, వధువును ఆశ్చర్యపరుస్తూ వరుడు వింత వింత పనులు చేయడం, వధూవరులను కొన్నిసార్లు స్నేహితులు ఆటపట్టించడం జరుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వివాహానికి సంబంధించిన వీడియో (Wedding videos) ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివాహ వేదికపై తాళి కట్టే సమయంలో వధువు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు..

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో.. 10 నెలల పాటు పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ (Instagram viral videos) అవుతోంది. వధూవరులు (bride and groom) వివాహ వేదికపై ఆశీనులై ఉంటారు. బంధువులు, సన్నిహితులంతా వేడుకను తిలకిస్తూ ఉంటారు. ఈలోగా తాళి కట్టే సమయం రానే వస్తుంది. వధువు మెడలో వరుడు తాళి కడుతుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. తీరా తాళి కట్టే సమయంలో వధువు.. వరుడి మొఖంపై ముద్దు (kiss) పెడుతుంది. ఊహించని ఈ ఘటనతో వరుడు కూడా అవాక్కవుతాడు. అనంతరం వధువు నవ్వుతూ రియాక్షన్ ఇస్తుంది. దీంతో పక్కన ఉన్న వారితో పాటూ మంటపంలోని వారంతా తెగ నవ్వుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. ఈ జంట ఇలాగే కలకాలం ఆనందంగా జీవించాలి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఒంటరిగా ఉన్న సమయంలో మరదలి వద్దకు వెళ్లాడు.. ఊహించని విధంగా ఆమె చేసిన పనితో.. కాసేపటికి..

Updated Date - 2022-11-19T21:17:56+05:30 IST