అక్కడి రోడ్లలో నెమళ్ల సంచారం సాధారణమే.. ఎక్కడ చూసినా రంగుల మయమే.. వైరల్ అవుతోన్న వీడియో..

ABN , First Publish Date - 2022-01-24T03:24:46+05:30 IST

నెమళ్లను చూస్తే.. అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక పురి విప్పిన నెమలిని చూస్తే మనసు కూడా పులకరించిపోతుంది. దేశ జాతీయ పక్షి అయిన నెమళ్లు.. పార్కులు, అడవుల్లో కనిపించడం తప్ప మిగతా ప్రదేశాల్లో..

అక్కడి రోడ్లలో నెమళ్ల సంచారం సాధారణమే.. ఎక్కడ చూసినా రంగుల మయమే.. వైరల్ అవుతోన్న వీడియో..

నెమళ్లను చూస్తే.. అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక పురి విప్పిన నెమలిని చూస్తే మనసు కూడా పులకరించిపోతుంది. దేశ జాతీయ పక్షి అయిన నెమళ్లు.. పార్కులు, అడవుల్లో కనిపించడం తప్ప మిగతా ప్రదేశాల్లో చాలా అరుదుగా తారసపడుతుంటాయి. మన దేశంలో ఇటీవల నెమళ్ల సంఖ్య బాగా తగ్గిపోతోంది. నెమళ్లను వేటాడడం నేరమని తెలిసినా కొందరు వేటగాళ్లు లెక్కచేయడం లేదు. మామూలుగా 20 ఏళ్లు జీవించే నెమళ్లు.. ప్రత్యేక శ్రద్ధతో పెంచితే.. 40 నుంచి 50 ఏళ్లు కూడా జీవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే రోడ్ల మీద నెమళ్ల సంచారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...


దుబాయ్‌లోని రోడ్లపై నెమళ్లు గుంపులు గుంపులుగా సందడి చేయడం నెటిజన్లకు కనువిందు చేస్తోంది. ఆడ, మగ నెమళ్లు గుంపులు, గుంపులుగా రావడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే రకరకాల రంగుల్లో ఉన్న నెమళ్లన్నీ ఒకేచోట కనిపించడంతో ఆ రోడ్డంతా రంగులమయమైంది. కొన్ని నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తుంటే.. మరికొన్ని అటూ ఇటూ తిరుగుతూ సందడి చేస్తుండడం ఆకట్టుకుంటోంది. ఈ నెమళ్ల వీడియోని బాలీవుడ్‌ టెలివిజన్‌ నటి మినీ మాథుర్.. తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ‘అపురూపమైన వీడియో’ అని క్యాప్షన్‌ ఇస్తూ పోస్టు చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరూ ఓ లుక్కేయండి..

ఈ కోతి ఆట ఆడే విధానం చూస్తే.. ఇదెక్కడి కోతిరా నాయనా అంటారు..

Read more