Viral: సింహం వీడియో.. అరుదుగా మాత్రమే కనిపించే సీన్ ఇది..

ABN , First Publish Date - 2022-11-11T20:57:48+05:30 IST

చెట్టెక్కి కునుకు తీస్తున్న సింహం వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Viral: సింహం వీడియో.. అరుదుగా మాత్రమే కనిపించే సీన్ ఇది..

ఇంటర్నెట్ డెస్క్: వణ్యప్రాణుల వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉండే ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతా నందా(Susanta Nanda) తాజాగా మరో వీడియోను ట్విట్ చేశారు. అది ఓ సింహానికి సంబంధించిన వీడియో. ఇందులో సింహం ఓ చెట్టెక్కి చిన్న కునుకు తీసింది(Lion on Tree). మొదట్లో గాఢ నిద్రలో ఉన్నట్టు కనిపించిన మృగరాజు ఆ మరుక్షణమే అటూ ఇటూ కదులింది. ఆవలించింది. ఒళ్లు విరుచుకుంది. మళ్లీ కునుకులోకి జారిపోయింది. ‘‘నీ విలువ అవతలివారికి తెలిసే వరకూ సింగిల్‌గా ఎంజాయ్ చేయ్..’’ అంటూ ఓ కామెంట్ కూడా జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. జంతు ప్రేమికులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కింగ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. సింహానికి బాగా సౌకర్యంగా ఉన్నట్టుంది అని అభిప్రాయపడ్డారు. శుక్రవారం మూడ్ అందరికీ ఇలాగే ఉంటుందేమో అని మరొకరు అభిప్రాయపడ్డారు.

అయితే.. శాస్త్రవేత్తల ప్రకారం సింహాలు రోజులో అధికభాగం ఇలా కునుకులు తీస్తూనే గడిపేస్తాయి. అది వాటి శారీరకధర్మం. వేట కోసం అవి వీలైనంతగా తమ శక్తిని జాగ్రత్తపరుచుకుంటాయి. అంతేకాకుండా.. ఇలా ఎత్తైన చెట్లపై కునుకు తీస్తే.. చుట్టు ఉన్న ప్రాంతం మొత్తంపై ఓ కన్నేసి ఉంచొచ్చు. అందుకే..సింహాలు కొన్ని సందర్భాల్లో ఇలా చేస్తుంటాయి. అయితే.. సింహాలు చెట్లపై నిద్రపోవడం చాలా అరుదుగా మాత్రమే జరిగే ఘటన అని నిపుణులు చెబుతుంటారు.

Updated Date - 2022-11-11T20:58:44+05:30 IST