Viral Video: ఈ యువతికి సడన్‌గా ఎంత కోపం వచ్చింది.. నువ్వు ఎవడైతే నాకేంటీ.. అంటూ ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2022-07-24T02:14:14+05:30 IST

చాలా మంది మహిళలు సన్నితంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం కోపం వస్తే మహంకాళిలా రెచ్చిపోతుంటారు. ఇంకొందరు యువతులు, మహిళలు.. చిన్న చిన్న సమస్యలకూ పెద్ద పెద్ద..

Viral Video: ఈ యువతికి సడన్‌గా ఎంత కోపం వచ్చింది.. నువ్వు ఎవడైతే నాకేంటీ.. అంటూ ఒక్కసారిగా..

చాలా మంది మహిళలు సన్నితంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం కోపం వస్తే మహంకాళిలా రెచ్చిపోతుంటారు. ఇంకొందరు యువతులు, మహిళలు.. చిన్న చిన్న సమస్యలకూ పెద్ద పెద్ద గొడవలు చేస్తుంటారు. ప్రేమికుల విషయంలో ఇలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రియుడి విషయంలో ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకున్న సందర్భాలు ఇటీవల చాలా చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి.. యువకుడిపై దాడికి తెగబడింది. నువ్వు ఎవడైతే నాకేంటీ.. అన్నట్లుగా రెచ్చిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ బార్‌లో మందు తాగిన యువతీయువకులు.. హాలులో గమికూడి ఉంటారు. ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఓ యువతికి సడన్‌గా పిచ్చ కోపం వచ్చింది. ఓ యువకుడిపై దాడికి తెగబడింది. ఈ అనూహ్య పరిణామానికి అవాక్కయిన యువకుడు.. ఆమెపై ప్రతి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. అయినా ఆమె ఏమాత్రం లెక్కచేయకుండా అతడిని షర్ట్ పట్టుకుని మరీ పిడి గుద్దులు కురిపిస్తుంది.

1433 Kilometers ప్రయాణించి భర్తను చేరుకున్న మహిళ.. ఇంటి ఎదుట ఏడు రోజులుగా కేవలం నీళ్లు తాగుతూ.. చివరకు రిక్షా డ్రైవర్ గమనించడంతో..


పక్కన ఉన్నవారు విడిపించాలని ఎంత ప్రయత్నించినా యువతి మాత్రం వినిపించుకోదు. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న పూల కుండీని తీసుకుని.. యువకుడి పైకి విసిరికొడుతుంది. చివరకు అక్కడే ఉన్న బౌన్సర్లు కలగజేసుకుని, ఆ యువకుడిని పక్కకు తీసుకెళ్తారు. దీంతో గొడవ సర్దుమణుగుతుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. సీసీ ఫుటేజీ ఆధారంగా యువతీయువకుల కోసం గాలిస్తున్నారు.

Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?





Updated Date - 2022-07-24T02:14:14+05:30 IST