వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో.. ఇతడు నిజంగా ఎంతో అదృష్టవంతుడు..

ABN , First Publish Date - 2022-07-04T01:30:45+05:30 IST

పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడ్డ సందర్భాల్లో, వెంట్రక వాసిలో తప్పిన ప్రమాదం.. అని అంటూ ఉంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది..

వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో.. ఇతడు నిజంగా ఎంతో అదృష్టవంతుడు..

పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడ్డ సందర్భాల్లో, వెంట్రక వాసిలో తప్పిన ప్రమాదం.. అని అంటూ ఉంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడిలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలబడ్డ ఓ వ్యక్తి పైకి ట్రక్కు దూసుకొస్తుంది. కానీ అదృష్టవశాత్తు.. ఆ వ్యక్తి ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


బ్రెజిల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిలబడి ఉంటాడు. అదే సమయంలో వెనక ఓ ట్రక్కు వేగంగా వస్తూ ఉంటుంది. అయితే రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టుకు వాహనం వెనుక భాగం తగులుకోవడంతో ఇంజన్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. దీంతో అంతే వేగంతో వచ్చి.. వ్యక్తి నిల్చున్న ప్రాంతంలో పడుతుంది. ఇంచు దూరంలో పడడంతో ఆ వ్యక్తి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడతాడు. అతన్ని తాకీతాకనట్లుగా వచ్చిన వాహనం.. చివరకు ఒక్కసారిగా ఆగిపోతుంది. కానీ ఆ వ్యక్తికి మాత్రం ఎలాంటి గాయాలూ కావు. దీంతో బతుకుజీవుడా.. అంటూ అక్కడి నుంచి పరుగందుకుంటాడు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ఆడామగా తేడా లేకుండా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న జంటలు.. వీళ్లకేం పోయే కాలంరా నాయనా.. అని అంటున్న నెటిజన్లు..

Read more