కుమారుని కోసం తల్లి తాపత్రయం... దానిని నెరవేర్చేందుకు కుమారుని పాదయాత్ర!

ABN , First Publish Date - 2022-12-13T08:27:25+05:30 IST

తల్లికోరికను నెరవేర్చేందుకు, ఆమె నమ్మకాన్ని నిలబెట్టేందుకు దేవ్ ఉపాధ్యాయ లండన్ నుంచి ఇండియా వచ్చి ద్వారక నుంచి తిరుపతి, పంఢరపురం వరకు పాదయాత్ర చేశారు.

కుమారుని కోసం తల్లి తాపత్రయం... దానిని నెరవేర్చేందుకు కుమారుని పాదయాత్ర!

తల్లికోరికను నెరవేర్చేందుకు, ఆమె నమ్మకాన్ని నిలబెట్టేందుకు దేవ్ ఉపాధ్యాయ లండన్ నుంచి ఇండియా వచ్చి ద్వారక నుంచి తిరుపతి, పంఢరపురం వరకు పాదయాత్ర చేశారు. ఏడాది క్రితం దేవ్‌కు దృష్టిలోపం ఏర్పడింది. ఆ సమయంలో చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. అప్పుడు దేవ్ కళ్లు బాగుపడితే తిరుపతి, పంఢరపురం, ద్వారకకు కాలినడకన వస్తాడని అతని తల్లి కృష్ణ మందిరంలో మొక్కుకుంది.

ఆపరేషన్ తర్వాత దేవ్‌కు కంటిచూపు వచ్చింది, పూర్తిగా కోలుకున్న తర్వాత తన తల్లిపై గౌరవంతో అతను పాదయాత్ర ప్రారంభించాడు. ఈ పాదయాత్రలో అతని భార్య కూడా పాల్గొంది. ఈ సందర్భంగా దేవ్ మాట్లాడుతూ.. చదువు ప్రాధాన్యత చదువుకే ఉంటుందని, మతం గొప్పదనం మతానిదే అన్నారు. తన తల్లికి భగవంతునిపై ఉన్న నమ్మకం వల్లనే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

Updated Date - 2022-12-13T08:27:25+05:30 IST

Read more