చిన్న గుడిసెలో టీ దుకాణం నడుపుతున్న యూపీ సీఎం యోగి సోదరి.. అన్నయ్యను ఆమె ఏం అడుగుతోందంటే..

ABN , First Publish Date - 2022-04-05T19:43:31+05:30 IST

దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించి బీజేపీని అధికారంలో కూర్చోబెట్టారు యోగి ఆదిత్యనాథ్.

చిన్న గుడిసెలో టీ దుకాణం నడుపుతున్న యూపీ సీఎం యోగి సోదరి.. అన్నయ్యను ఆమె ఏం అడుగుతోందంటే..

దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించి బీజేపీని అధికారంలో కూర్చోబెట్టారు యోగి ఆదిత్యనాథ్. నిరాడంబరంగా, సన్యాసి వేషధారణలో ఉండే యోగి జీవన విధానం చాలా సాధారణంగా ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికీ పేదరికంతో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని కొఠారి గ్రామానికి చెందిన అజయ్ సింగ్ బిష్త్ 18 సంవత్సరాల వయస్సులో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ ఆశ్రమంలో చేరి ఆదిత్యనాథ్‌గా తన పేరును మార్చుకున్నారు. ఆ తర్వాత ఆరెస్సెస్, బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 


ఉత్తరాఖండ్‌లోని తన గ్రామంలో యోగి సోదరి శశి సింగ్ ప్రస్తుతం చిన్న టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె ప్రతిరోజూ రెండున్నర కిలోమీటర్లు నడిచి కొండ ఎక్కి అక్కడ ఉన్న పార్వతీ దేవి ఆలయం ముందు టీ, స్నాక్స్, ప్రసాదం అమ్ముతుంటుంది. ఆమె భర్త పురాణ్ సింగ్ అక్కడే కప్పులు కడుగుతుంటాడు. సోదరుడు ఓ పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా శశి సింగ్ మాత్రం సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడుతోంది. తమ సోదరుడి నుంచి తామేం ఆశించడం లేదని, కాకపోతే ఒకసారి ఇంటికి వచ్చి తల్లిని కలవాలని సోదరుడికి ఆమె విజ్ఞప్తి చేసింది. 


`నా పెళ్లికి ముందు, మహారాజ్ జీ (యోగి)తో చాలా కాలం కలిసి ఉన్నాను. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్లం. యోగిది మొదటి నుంచి భిన్నమైన స్వభావం. భక్తి భావం ఎక్కువ. 1991లో నా పెళ్లి జరిగింది. యోగి నా వివాహంలో చేయాల్సిన అన్ని కర్మలు చేశాడు. అతను రిషికేశ్‌లో చదువుకునేటప్పుడు, ఢిల్లీ నుంచి కాలినడకన మా గ్రామానికి వచ్చేవాడు. అతనికి నా చిన్న కూతురు అంటే చాలా ఇష్టం. మేనకోడలిని చూడటానికి తరచుగా వచ్చేవాడ`ని శశి చెప్పారు. 


Read more