-
-
Home » Prathyekam » UK porn stars halt work amid syphilis outbreak in Europe guru-MRGS-Prathyekam
-
UK porn stars halt work: సిఫిలిస్ వ్యాధి భయంతో షూటింగులు మానుకున్న యూకే పోర్న్‌స్టార్లు!
ABN , First Publish Date - 2022-09-29T21:56:39+05:30 IST
యూరప్‌లో సిఫిలిస్(syphilis) వ్యాధి శరవేగంగా సంక్రమిస్తోందన్న వార్తలు యూకేలోని అడల్ట్ స్టార్ల(UK porn stars)పై

లండన్: యూరప్‌లో సిఫిలిస్(syphilis) వ్యాధి శరవేగంగా సంక్రమిస్తోందన్న వార్తలు యూకేలోని అడల్ట్ స్టార్ల(UK porn stars)పై తీవ్ర ప్రభావం చూపుతోంది. శృంగారం ద్వారా సంక్రమించే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ యూరప్‌లో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోందన్న అమెరికాకు చెందిన ‘పాస్’ (PASS) హెచ్చరికలతో అప్రమత్తమైన యూకే పోర్న్ స్టార్లు(UK porn stars)షూటింగులు మానుకున్నారు. అంతేకాదు, తమ కోసం కూడా ఓ యూనియన్ ఉండాలని ఇప్పుడు వారంతా కోరుకుంటున్నారు.
సిఫిలిస్(syphilis) అనేది లైంగిక చర్య ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది సోకిన వారి శరీరంపై దద్దుర్లు వస్తాయి. యాంటీబయాటిక్స్ చికిత్స ద్వారా దీనిని అదుపు చేయవచ్చు. అయితే, అలాగే వదిలేస్తే మాత్రం చాలా ప్రమాదకరంగా మారుతుంది. శాశ్వతంగా వేధిస్తుంది. అంతర్గత అవయవాలు దెబ్బతినడం, మెదడు పనితీరులో మార్పు రావడం వంటివి చోటుచేసుకుంటాయి. అమెరికాకు చెందిన ‘పాస్’ పోర్న్ నటుల(porn stars) లైంగికపరమైన ఆరోగ్య డేటా బేస్‌ను నిర్వహిస్తూ ఉంటుంది. ఇప్పుడిదే ఈ హెచ్చరికలు జారీ చేసింది. అడల్ట్ నటులకు ఇటీవల నిర్వహించిన సిఫిలిస్(syphilis) పరీక్షలో చాలామందికి ‘పాజిటివ్’ అని తేలడంతో యూరప్‌కు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాకు చెందిన పోర్న్ నటులు(UK porn stars) సహా ఇలా చాలామందికి సంక్రమించే అవకాశం ఉందని పేర్కొంది.
‘పాస్’ ఇలా హెచ్చరికలు జారీ చేసిందో, లేదో యూకే పోర్న్ స్టార్ల(UK porn stars)లో కలవరం మొదలైంది. వెంటనే షూటింగులు మానుకున్నారు. ప్రొడ్యూసర్లు కూడా షూటింగులు నిలిపివేశారు. లియన్ యంగ్ అనే మాజీ పోర్న్ స్టార్ మాట్లాడుతూ.. సిఫిలిస్(syphilis) ఆందోళనల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా షూటింగులు నిలిచిపోయినట్టు పేర్కొంది. షూటింగ్ కోసం వరుసలో ఉన్న చిత్రాలను కూడా నిలిపివేసినట్టు పేర్కొంది. బిగ్ ప్రొఫైల్ కలిగిన ప్రొఫెషనల్ స్టార్లు కూడా సిఫిలిస్(syphilis) అంటే భయపడుతున్నారని, వారు చాలా పెద్దమొత్తంలో ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.