ఏ పాపం తెలియని ఈ రెండేళ్ల బాలుడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వస్తోందంటే..

ABN , First Publish Date - 2022-11-18T15:32:06+05:30 IST

జైలు అనే పదానికి అర్థం కూడా తెలియని ఆ పిల్లాడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది

ఏ పాపం తెలియని ఈ రెండేళ్ల బాలుడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వస్తోందంటే..

ఆ పిల్లాడికి ఏమీ తెలియదు ఆకలేస్తే అమ్మను అడగడం, అమ్మ పెట్టే గోరు ముద్దలు తినడం, అమ్మ ఒడిలో నిద్రపోవడం ఇవి మాత్రమే తెలుసు. కానీ ఆ పిల్లాడు ఇప్పుడు జైలు గోడల మధ్య జీవితాన్ని గడపాల్సి వస్తోంది. కనీసం ఆ జైలు అనే పదానికి అర్థం కూడా తెలియని ఆ పిల్లాడికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. తల్లి ఒడి శ్రీరామ రక్ష అంటారే.. ఆ పిల్లాడి తల్లి చేసిన పని ఆ బాబుకి శాపంలా ఎందుకు మారుతోంది?? దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

బిహార్ రాష్ట్రం, బధరా జిల్లాలో కృష్ణ గడ్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఓ హత్యకేసు నమోదు అయ్యింది. రూబీ అనే మహిళను, ఆమె భర్తను, మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూబీ, చందన్ అనే వ్యక్తిలో ప్రేమలో ఉంది. రూబీకి రాజు పాశ్వాన్ అనే వ్యక్తితో వివాహం జరిగినా ఆమె చందన్ తో అక్రమసంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రూబీ, చందన్ కు ఫోన్ చేసి 'ఇంట్లో ఎవరూ లేరు ఇంటికి రా' అని చెప్పింది. చందన్ ఆమె చెప్పినట్టే రూబీ ఇంటికి వెళ్ళాడు. వారిద్దరూ పడకగదిలో ఉండగా రూబీ భర్త రాజు పాశ్వాన్ ఇంటికి వచ్చాడు. చందన్, రూబీ ఇద్దరూ అభ్యంతకర పరిస్థితిలో రాజు పాశ్వాన్ కు కనిపించారు. ఆగ్రహించిన రాజు, రూబీని అక్కడికక్కడే కొట్టాడు. రూబీని ఎందుకు కొడతావు తనని కొడితే చంపేస్తాను అని చందన్, రాజు పాశ్వాన్ ను బెదిరించాడు. తన ఇంట్లో జరిగిన పనికే రగిలిపోతున్న పాశ్వాన్, చందన్ మాటలకు మరింత ఉగ్రుడు అయిపోయాడు. వారి మధ్య గొడవ కాస్తా ముదరడం, పాశ్వాన్ కుటుంబ సభ్యులు ఇంటికి రావడం రెండూ ఒకే సారి జరిగాయి. వారందనీ చూసిన చందన్ భయపడి అక్కడి నుంజి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే పాశ్వాన్ కుటుంబ సభ్యులు చందన్ మీద దాడి చేయడానికి ప్రయత్నించడంతో చందన్ అక్కడి నుండి పరిగెడుతూ మెట్ల మీద పడిపోయాడు. అతని మీద పీకల్లోతు కోపంలో ఉన్న ఆ ఇంటివారు అతని మీద దాడి చేశారు. ఒకవైపు మెట్ల మీద నుండి పడటం, మరోవైపు పాశ్వాన్ కుటుంబ సభ్యుల దాడి రెండూ కలిపి చందన్ ప్రాణాలు తీశాయి.

పెళ్ళయ్యుండీ అలా ప్రియుడిని ఇంటికి రమ్మనడం రూబీదే తప్పు అయినా చందన్ మరణించాడు కాబట్టి పాశ్వాన్ ను, చందన్ మీద దాడి చేసిన మరొక నలుగురు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ మరొక విస్తుపోయే విషయం ఏమిటంటే రూబీ ఇప్పుడు 9నెలల గర్భవతి. నాలుగైదు రోజులలోపు ఈమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోందట. కాగా రెండున్నరేళ్ళ రూబీ కొడుకు చిన్నపిల్లాడు కాబట్టి ఆ పిల్లాడు తల్లిని వదిలి ఉండలేడు. ఏ పాపం తెలియని ఆ బాలుడు కూడా తల్లి నిర్వాకం వల్ల జైలు గోడల మధ్య గడపాల్సి వస్తోంది..

Updated Date - 2022-11-18T15:32:09+05:30 IST