Mysore: 2 లక్షల పూలతో రాష్ట్రపతి భవన్‌

ABN , First Publish Date - 2022-10-02T15:59:40+05:30 IST

మైసూరు(Mysore) దసరా ఉత్సవాల్లో ఫలపుష్ప ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండు లక్షల పూలతో ఏర్పాటు చేసిన రాష్ట్రపతి

Mysore: 2 లక్షల పూలతో రాష్ట్రపతి భవన్‌

                                         - మైసూరులో ప్రత్యేక ఆకర్షణగా ఫలపుష్ప ప్రదర్శన


బెంగళూరు, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మైసూరు(Mysore) దసరా ఉత్సవాల్లో ఫలపుష్ప ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రెండు లక్షల పూలతో ఏర్పాటు చేసిన రాష్ట్రపతి భవన్‌ నమూనా సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రదర్శనలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌కు చెందిన గాజనూరు నివాసం, చాముండి కొండలు, నంది విగ్రహం, పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌కు చెందిన ఐదు నమూనాలు ఉన్నాయి. వీటితోపాటు వివిధ ప్రాణులు, పక్షులు, బొమ్మలను పూలతో రూపొందించారు. ఏడు అడుగుల తేనెపట్టు, 12 అడుగుల జిరాఫీ, క్యాప్సికమ్‌ నమూనాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. 



Updated Date - 2022-10-02T15:59:40+05:30 IST