auto driver hits jackpot: కుమారుడి కిడ్డీ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొని లాటరీ టికెట్ కొంటే...బంపర్ ఆఫర్

ABN , First Publish Date - 2022-09-19T13:06:32+05:30 IST

కుమారుడి కిడ్డీ బ్యాంక్(piggy bank) నుంచి డబ్బు తీసుకొని లాటరీ టికెట్ కొన్న ఆటోడ్రైవరుకు కేరళ లాటరీ ఓనం బంపర్ ఆఫర్ వరించిన ఘటన...

auto driver hits jackpot: కుమారుడి కిడ్డీ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొని లాటరీ టికెట్ కొంటే...బంపర్ ఆఫర్

తిరువనంతపురం(కేరళ): కుమారుడి కిడ్డీ బ్యాంక్(piggy bank) నుంచి డబ్బు తీసుకొని లాటరీ టికెట్ కొన్న ఆటోడ్రైవరుకు కేరళ లాటరీ ఓనం జాక్‌పాట్ వరించిన ఘటన కేరళ (kerala)రాష్ట్రంలో వెలుగుచూసింది. తిరువనంతపురం నగరంలోని శ్రీవరాహం ప్రాంత వాసి అయిన ఆటోరిక్షా డ్రైవరు(auto driver hits jackpot)అనూప్(32)(Anoop)కేరళ లాటరీలో రూ.25కోట్ల జాక్‌పాట్ కొట్టారు.టీజే 750605 నంబరు గల టికెట్ కు లాటరీ దక్కింది. కేరళ ఓనం బంపర్ లాటరీ(onam bumper lottery) టికెట్ 500 రూపాయలు పెట్టి కొనడానికి అనూప్ వద్ద 50రూపాయల డబ్బు తక్కువ పడటంతో తన కుమారుడి కిడ్డీ బ్యాంకు ముంతను పగులగొట్టి తీసుకున్నాడు. ‘‘నా కుమారుడి కిడ్డీ బ్యాంకు నుంచి 50రూపాయలు తీసుకొని లాటరీ టికెట్ కొన్నాను...నాకు లాటరీ దక్కకుంటే నా భార్య నన్ను శిక్షించేది, లాటరీ టికెట్లపై ఎక్కువ డబ్బు వెచ్చించవద్దని నా భార్య నాకు ఎల్లప్పుడూ చెబుతుండేది’’ అని లాటరీ విజేత అనూప్ చెప్పారు. 


అనూప్ ఉద్యోగం కోసం మలేషియా నెలరోజుల్లో మలేషియా దేశానికి వెళ్లాలని అనుకున్నారు. తన రోజువారీ ఖర్చుల కోసం కూడా డబ్బు లేక అవస్థలు పడ్డానని అనూప్ చెప్పారు. ‘‘నేను కొన్న లాటరీ టికెట్టుకు మొదటి బహుమతి వచ్చిందని తెలిసి నా భార్యకు చూపించగా ఆమె కూడా చూసి ఎంతో ఆనందించింది. నేను ముందు మరో లాటరీ టికెట్ తీసుకున్నాను,కాని దాన్ని వాపసు ఇచ్చి బహుమతి వచ్చిన ఈ టికెట్ తీసుకున్నాను, గతంలోనూ నాకు ఒకసారి కొన్న లాటరీ టికెట్టుకు రూ.5వేల బహుమతి వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో బహుమతి లభించడం నాకెంతో సంతోషంగా ఉంది’’ అని అనూప్ వివరించారు. 



అనూప్ కుటుంబంలో భార్య, కుమారుడు, తల్లి ఉన్నారు.అనూప్ లాటరీ ఏజెంటు అయిన సుజయాకు సోదరుడు. తాను లాటరీలో మొదటి బహుమతి వస్తుందని ఊహించలేదని అనూప్ సంతోషంతో చెప్పారు. ఈయన శనివారం రాత్రి పజావంగడిలోని శ్రీ భగవతీ ఏజెన్సీలో లాటరీ టికెట్ కొన్నాడు. 


Updated Date - 2022-09-19T13:06:32+05:30 IST