‘ఈ పుష్ప మా టీంను తక్కువ అంచనా వేశాడు’.. Viral అవుతున్న IFS officer ట్వీట్!

ABN , First Publish Date - 2022-07-08T18:51:17+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ నటించి ‘పుష్ప’ సినిమా.. దేశ వ్యాప్తంగా సినీ ప్రియులకు పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. కాగా.. ఆ పాన్ ఇండియా మూవీని గుర్తు చేస్తూ.. ఇండియన్ ఫారెస్ట్ అధికారి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా

‘ఈ పుష్ప మా టీంను తక్కువ అంచనా వేశాడు’.. Viral అవుతున్న IFS officer ట్వీట్!

ఇంటర్నెట్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ నటించి ‘పుష్ప’ సినిమా.. దేశ వ్యాప్తంగా సినీ ప్రియులకు పూనకాలు తెప్పించిన విషయం తెలిసిందే. కాగా.. ఆ పాన్ ఇండియా మూవీని గుర్తు చేస్తూ.. ఇండియన్ ఫారెస్ట్ అధికారి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘పుష్ప’ మూవీలో అల్లూ అర్జున్ కోట్లాది రూపాయలు విలువైన ఎర్రచందనాన్ని పోలీసుల కళ్లుగప్పి స్మగ్లింగ్ చేస్తాడు. అచ్చం సినిమాలోలాగే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కొందరు స్మగర్లు.. వోల్వో స్లీపర్ బస్‌లో టేకు కలపను రవాణా చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. పక్కా సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు అధికారులు ఆ బస్సును తనిఖీలు చేసి, కలపను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారుల పని తీరుపై ఫారెస్ట్ అధికారి పర్వీన్ కస్వాన్ అభినందిస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ పుష్ప మా టీంను తక్కువ అంచనా వేసింది’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ.. అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
Read more