స్కూలు ముందు రోడ్డుపై అపస్మారక స్థితిలో ఓ విద్యార్థి.. ఆస్పత్రిలో మృతి.. అసలేం జరిగిందో ఆ తల్లిదండ్రులకు తెలిసి..

ABN , First Publish Date - 2022-09-29T20:41:52+05:30 IST

మూడవ తరగతి చదివే పిల్లాడి విషయంలో ఒక ఘోరం జరిగిపోయింది. ఊహించని స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఆ పిల్లాడి కథేంటంటే.. మూడవ తరగతి చదివే పిల్లాడి విషయంలో ఒక ఘోరం జరిగిపోయింది. ఊహించని స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఆ పిల్లాడి కథేంటంటే.. మూడవ తరగతి చదివే పిల్లాడి విషయంలో ఒక ఘోరం జరిగిపోయింది. ఊహించని స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఆ పిల్లాడి కథేంటంటే..

స్కూలు ముందు రోడ్డుపై అపస్మారక స్థితిలో ఓ విద్యార్థి.. ఆస్పత్రిలో మృతి.. అసలేం జరిగిందో ఆ తల్లిదండ్రులకు తెలిసి..పిల్లలు తోటలో పువ్వుల లాంటి వాళ్ళు అంటాడు ప్రముఖ పిల్లల మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రోబెల్. ప్రతి ఇంట్లో పిల్లలు వారి తల్లిదండ్రుల దగ్గర ఎంతో గారాలు పోతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను తిట్టడం కానీ చెయ్యిచేసుకోవడం కానీ చెయ్యాలంటే చాలా బాధపడతారు. పిల్లలు బడికి వెళ్ళినప్పటి నుండి తిరిగి ఇంటికి ఎప్పుడెప్పుడొస్తారా అని ఎదురుచూస్తారు తల్లిదండ్రులు. అంత ప్రేమ ఉంటుంది పిల్లల మీద. అలాంటిది తమ పిల్లలను వేరే వాళ్ళు కొడితే, ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే చాలా కోప్పడతారు. అయితే బిహార్ రాష్ట్రంలో మూడవ తరగతి చదివే పిల్లాడి విషయంలో ఒక ఘోరం జరిగిపోయింది. ఊహించని స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఆ పిల్లాడి కథేంటంటే..


బిహార్ లోని వజీర్ గంజ్-ఫతేపూర్ రోడ్ లో లిటిల్ లీడర్స్ పబ్లిక్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ లో మూడవ తరగతి పిల్లలకు వికాస్ సింగ్ అనే క్లాస్ టీచర్ పాఠాలు చెబుతూ ఉంటాడు. ఆ క్లాస్ లోనే వివేక్ కుమార్ చదువుతున్నాడు. ఇంటికీ. స్కూల్ కు 3 కిలోమీటర్ల దూరం ఉండటంతో వివేక్ ను తల్లిదండ్రులు స్కూల్ హాస్టల్ లోనే ఉంచారు. వివేక్ హోమ్ వర్క్ చెయ్యలేదని వికాస్ సింగ్ చావగొట్టాడు. అంతేకాదు స్కూల్ లో నుండి బయటకు తోసేసి గేటు వేసేశాడు. శరీర పైభాగంలో చాలా బలమైన దెబ్బలు తగలడంతో లేత శరీరం చాలా వాచిపోయింది. స్పృహ తప్పిపోయి రోడ్డు పక్కన పడిపోయాడు. ఆ దారిలో వెళ్తూ ఆ పిల్లాడిని చూసిన ఒక వ్యక్తి గుర్తు పట్టి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లాడి ఇంటికి తీసుకెళ్ళాడు.


పిల్లాడి శరీరం మీద బాగా గాయాలు ఉండటంతో ఆ పిల్లాడి తాత పిల్లాడిని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. పోలీసులు మొదట పిల్లాడిని హాస్పిటల్ కు  తీసుకెళ్ళమని చెప్పగా దగ్గర్లో ఉన్న హాస్పెటల్ కు తీసుకెళ్లాడు. అయితే పిల్లాడి పరిస్థతి విషమంగా ఉందని వేరే పెద్ద హాస్పిటల్ కు డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం వేరే హాస్పిటల్ కు తీసుకెళుతుండగా పిల్లాడు దారిలోనే చనిపోయాడు. పిల్లాడిని ఎక్కువగా కొట్టడం వల్లే చనిపోయాడని డాక్టర్లు తేల్చిచెప్పారు. దెబ్బల కారణంగానే పిల్లాడు మృతి చెందాడని వెల్లడించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే తనను ఓ ఉపాధ్యాయుడు కొట్టాడనీ, హోం వర్క్ చేయలేదని తీవ్రంగా కొట్టాడని ఆ బాలుడు అసలేం జరిగిందన్నది వెల్లడించాడు. 


దీంతో ఆగ్రహంతో ఆ పిల్లాడి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు అంతా స్కూల్ బయట దర్నా చేశారు. బాలుడిని కొట్టిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాల్సిందేననీ.. అరెస్ట్ చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఇదంతా జరిగాక పోలీసులు కేసు నమోదు చేసుకుని టీచర్ వికాస్ సింగ్ ను సెక్షన్ 302 కింద అరెస్ట్ చేశారు. స్కూల్ దగ్గర వాతావరణం గందరగోళంగా ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇలా ఓ ఉపాద్యాయుని అత్యుత్సాహం పిల్లాడి ప్రాణాన్ని బలి తీసుకుంది.

Read more