చాణక్య నీతి: ఈ తరహా వ్యక్తులకు దూరంగా ఉంటే.. ప్రతికూలత మిమ్మల్ని ఎప్పటికీ తాకలేదు!

ABN , First Publish Date - 2022-02-19T12:08:38+05:30 IST

ఆచార్య చాణక్యుడు సమర్థవంతమైన ఆర్థికవేత్త..

చాణక్య నీతి: ఈ తరహా వ్యక్తులకు దూరంగా ఉంటే.. ప్రతికూలత మిమ్మల్ని ఎప్పటికీ తాకలేదు!

ఆచార్య చాణక్యుడు సమర్థవంతమైన ఆర్థికవేత్త, వ్యూహకర్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త. ఆచార్య తన జీవితంలో చాలా కష్టమైన సమయాలను చూశాడు. అయితే ప్రతి పరిస్థితిని దృఢంగా ఎదుర్కోవడమే కాకుండా, ఆ పరిస్థితులను అనుభవ పాఠాలుగా మలచుకున్నాడు. ఆచార్యకు ఎదురైన ప్రతికూల పరిస్థితులే అతనికి సహాయం చేసి.. ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాయి. ఆచార్యకు జీవితంలోని ప్రతి రంగంలోనూ అలాంటి అనుభవం ఉంది. అతను ఏ పరిస్థితిని అయినా ముందుగానే అంచనా వేసేవాడు. ఆచార్య తన అనుభవాల సారాంశాన్ని చాణక్య నీతి అనే పుస్తకంలో రాశారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఆచార్య చెప్పిన విధానాలను అమలు చేస్తే, ఆ వ్యక్తి అన్ని కష్టాల నుండి సులభంగా దాటగలుగుతాడు. చాణక్య నీతిలో, ఆచార్య.. మూడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల మీ జీవితంలో ఎలాంటి ప్రతికూలత ఎదురుకాదని తెలియజెప్పాడు. 

మూర్ఖశిష్యోపదేశేన్ దుష్టస్త్రీభరణేన్ చ దుఃఖితై: సంప్రయాగేన పన్డితో ప్యవసీదతి

ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా మూడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలని తెలియజెప్పారు.


మూర్ఖులతో అధికంగా మాట్లాడకు

మూర్ఖునితో ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడకూడదని లేదా అతనికి ఏదైనా విషయాన్ని వివరించే ప్రయత్నం చేయకూడదని ఆచార్య చాణక్యుడు తెలిపాడు. అటువంటివారికి ఎంత చెప్పినా, వాస్తవం గ్రహించక.. తానే గొప్పవాడినని తనకు ఎదురులేదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అటువంటి పరిస్థితిలో అతనితో సంబాషణ మీ శక్తి వృథా చేసుకున్నట్లు అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో ప్రతికూలత, కోపం, చికాకు మీలో ఏర్పడతాయి. ఈ విధంగా మన మనసును పాడు చేసుకోకూడదు. మూర్ఖులకు దూరంగా ఉండటమే ఉత్తమం. 

దుర్మార్గులపై జాలి చూపకు!

చాణక్య నీతి ప్రకారం, ఇతరులకు సహాయం చేయడం మంచి విషయమే. అయితే ఇతరుల విషయంలో తప్పుడు ఆలోచనలు కలిగి, అసూయ వ్యక్తం చేసే దుష్ట స్త్రీలకు దూరంగా ఉండటం ఉత్తమం. అలాంటి స్త్రీ ఇంట్లో ఉంటే కష్టాలను పెంచుతుంది. అలాంటివారిపై మీరు దయ చూపితే వారు మీ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తరువాత మీకే హాని కలిగించవచ్చు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు కలిగిన స్త్రీలపై ఎంతమాత్రం దయ చూపకూడదు. 

దేవుణ్ణి దూషించేవారికి దూరంగా ఉండు 

నిత్యం దుఃఖంలో మునిగితేలుతూ, ప్రతి విషయానికీ విధిని, భగవంతుడిని నిందించేవారికి వారికి దూరంగా ఉండాలి. అలాంటి వారు ఎప్పుడూ సంతృప్తిగా ఉండరు. ఇతరులను సంతృప్తి పరచడానికి ప్రయత్నించరు. ఇలాంటి వారితో మీరు కలిసి ఉంటే, వారి ప్రతికూల ఆలోచనలతో మిమ్మల్ని నిరాశావాదిగా మారుస్తారు. Read more