పందికొక్కుతో ఫుట్‌బాల్ ఆడుకున్న పెంపుడు కుక్కలు.. తీరా నోటికందే సమయంలో ఊహించని ట్విస్ట్..

ABN , First Publish Date - 2022-05-28T00:10:30+05:30 IST

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దేశ విదేశాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా మారుమూల గ్రామాల ప్రజల వరకు వెళ్తున్నాయి. వాటిలో వినూత్నంగా ఉండే వీడియోలు..

పందికొక్కుతో ఫుట్‌బాల్ ఆడుకున్న పెంపుడు కుక్కలు.. తీరా నోటికందే సమయంలో ఊహించని ట్విస్ట్..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దేశ విదేశాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా మారుమూల గ్రామాల ప్రజల వరకు వెళ్తున్నాయి. వాటిలో వినూత్నంగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెంపుడు కుక్కలన్నీ కలిసి పందికొక్కును తినే క్రమంలో ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంటుంది..


న్యూయార్క్‌లోని టాంప్‌కిన్స్ స్క్వేర్ డాగ్ రన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. యజమానులంతా వాటి పెంపుడు కుక్కలను తీసుకుని బయటికి వస్తారు. వాటిని పార్కులో సరదాగా వదిలేస్తారు. అదే సమయంలో అక్కడి ఖాళీ ప్రదేశంలోకి ఓ పందికొక్కు వస్తుంది. దాన్ని చూడగానే కుక్కలన్నీ ఒకేసారి దాని మీద దాడి చేస్తాయి. పందికొక్కును తినే క్రమంలో కుక్కలన్నీ ఒకదానికొకటి పోటీపడతాయి. ఓ కుక్క పందికొక్కును నోటితో పట్టుకుని, మళ్లీ విసిరికొడుతుంది. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడుతుంది.

20 నిమిషాల ముందే స్టేషన్ కు చేరిన రైలు.. ప్రయాణికుల రియాక్షన్ చూస్తే..


వాటిని గమనించిన యజమానులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకుంటారు. పందికొక్కును తినకుండా ఎవరి కుక్కలను వారు అడ్డుకుంటారు. దీంతో పందికొక్కు.. బతుకు జీవుడా.. అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

 ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..

Read more