రూ.21 లక్షల కట్నం ఇచ్చి మరీ కూతురికి పెళ్లి చేశారు.. ఏడాది కూడా కాకముందే ఎంత పని జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-09-14T01:52:11+05:30 IST

పాపం! కొత్తగా అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆ యువతికి.. ఆ సంతోషం ఎన్నో నెలలు నిలవదని తెలీదు. ఒకవేళ ముందే తెలిసుంటే తల్లిదండ్రులు వివాహమే చేసేవారు కాదు. కూతురు..

రూ.21 లక్షల కట్నం ఇచ్చి మరీ కూతురికి పెళ్లి చేశారు.. ఏడాది కూడా కాకముందే ఎంత పని జరిగిందంటే..

పాపం! కొత్తగా అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఆ యువతికి.. ఆ సంతోషం ఎన్నో నెలలు నిలవదని తెలీదు. ఒకవేళ ముందే తెలిసుంటే తల్లిదండ్రులు వివాహమే చేసేవారు కాదు. కూతురు బాగుండాలనే ఉద్దేశంతో రూ.21లక్షల కట్నం ఇచ్చి మరీ ఘనంగా పెళ్లి చేశారు. అంతా అనుకున్నట్లే జరుగుతుండడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. అయితే నెలలు గడిచే కొద్దీ కూతురు సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. ఏడాది కూడా కాకముందే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని వారు కలలో కూడా ఊహించలేదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సాగర్‌లోని గోపాల్‌గంజ్ పరిధి శ్రీరామ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న పునీత్ శర్మకు ప్రతిష్ఠ అనే యువతితో జనవరి 20న వివాహమైంది. పెళ్లి సమయంలో ప్రతిష్ఠ కుటుంబీకులు పునీత్ శర్మకు కట్నం కింద రూ.21 లక్షలు ఇచ్చారు. వివాహానంతరం దంపతులు సంతోషంగానే ఉండేవారు. అయితే ప్రతిష్ఠకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. నెలలు గడిచే కొద్దీ పునీత్ మద్యానికి బానిసయ్యాడు. అంతటితో ఆగకుండా అదనపు కట్నం తేవాలంటూ ఒకసారి, త్వరగా బిడ్డను కనాలంటూ ఇంకోసారి.. ఇలా వివిధ సాకులు చూపుతూ భార్యను చిత్రహింసలకు (Torture) గురి చేసేవాడు. ఈ విషయాన్ని ప్రతిష్ఠ తన తల్లిదండ్రులకు చెబుతూ తరచూ బాధపడుతూ ఉండేది.

బెదిరించి రూ.1.30 లక్షల్ని కొట్టేశారంటూ ఓ కుర్రాడి కేసు.. అతడి ఫోస్ స్విచాఫ్‌లోనే ఉండటంతో పోలీసులకు కొత్త డౌట్.. చివరకు..


కొన్నాళ్లు పోతే సమస్యలు సర్దుమణుగుతాయని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రతిష్ఠ తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ‘‘మీ కూతురు ఉరి వేసుకుంది’’.. అని పునీత్ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ప్రతిష్ఠ తల్లిదండ్రులు కంగారుగా అక్కడికి చేరుకున్నారు. కూతురు మృతదేహంపై పడి బోరున విలపించారు. అయితే కూతురు చేతులు, కాళ్లకు కత్తితో కోసినట్లు గాయాలు కనిపించాయి. తన కూతురు చంపేసి, డ్రామా ఆడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.

అవును.. 9 రోజుల క్రితం పుట్టిన కూతుర్ని ఎవరికీ తెలీకుండా నేనే చంపానంటూ ఆ తండ్రి చెప్పిన కారణం విని అంతా షాక్..!Read more