-
-
Home » Prathyekam » The grocery store owner who took the girls home and gave them chocolates and biscuits finally behaved indecently kjr spl-MRGS-Prathyekam
-
కిరాణ దుకాణ యజమాని అసభ్య ప్రవర్తన.. బాలికలకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్లి..
ABN , First Publish Date - 2022-09-09T02:27:40+05:30 IST
మనుమరాలి వయసున్న ఇద్దరు బాలికలతో (girls) కిరాణ దుకాణం యజమాని అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. పాఠశాల నుంచి ఇంటికి వస్తూ తినుబండారాలు కొనుగోలు..

మనుమరాలి వయసున్న ఇద్దరు బాలికలతో (girls) కిరాణ దుకాణం యజమాని అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. పాఠశాల నుంచి ఇంటికి వస్తూ తినుబండారాలు కొనుగోలు చేసేందుకు దుకాణం వద్ద ఆగిన చిన్నారులను లోపలికి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వారు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగుచూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (Yadadri Bhuvanagiri) పట్టణ పరిధిలోని రాయిగిరిలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, రూరల్ ఎస్ఐ రాఘవేందర్‌గౌడ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ (Telangana) భువనగిరి పట్టణ పరిధిలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు(9) బుధవారం సాయంత్రం పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న బల్ల లింగప్పకు చెందిన దుకాణంలో తినుబండారాలు కొనుగోలు చేసేందుకు ఆగారు. వారు అడిగిన చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చిన లింగప్ప.. లోపలికి రమ్మని పిలిచి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రోదిస్తూ అక్కడినుంచి ఇంటికి వెళ్లిన చిన్నారులు జరిగిన ఘటనపై తల్లిదండ్రులకు చెప్పారు. గురువారం తెల్లవారుజామున చిన్నారుల తల్లిదండ్రులు దుకాణం వద్దకు వెళ్లి యజమాని లింగప్పను నిలదీసి అతడిపై దాడి చేశారు.
పద్ధతి మార్చుకోమంటూ యజమాని హెచ్చరిక.. నిద్రపోతున్న సమయంలో వారి గదిలోకి వెళ్లిన వంట మనిషి.. చివరకు..
ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లింగప్పను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం తల్లిదండ్రుల సమక్షంలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపించారు. చిన్నారుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన లింగప్పపై పోక్సో కేసు (POCSO case) నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ రాఘవేంద్గౌడ్ తెలిపారు. 20 సంవత్సరాలుగా రాయిగిరిలో లింగప్ప కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా, పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు.