కదులుతున్న బైక్ నుంచి దూకేసిన 16 ఏళ్ల బాలిక.. హాస్పిటల్‌కు తరలించిన స్థానికులు.. ఆమె చెప్పింది విని షాకైన పోలీసులు..

ABN , First Publish Date - 2022-09-27T23:52:11+05:30 IST

ఆ బాలిక వయసు 16 ఏళ్లు.. పదో తరగతి చదువుతోంది.. ఆ బాలిక పది రోజుల క్రితం పాఠశాల నుంచి అదృశ్యమైంది.

కదులుతున్న బైక్ నుంచి దూకేసిన 16 ఏళ్ల బాలిక.. హాస్పిటల్‌కు తరలించిన స్థానికులు.. ఆమె చెప్పింది విని షాకైన పోలీసులు..

ఆ బాలిక వయసు 16 ఏళ్లు.. పదో తరగతి చదువుతోంది.. ఆ బాలిక పది రోజుల క్రితం పాఠశాల నుంచి అదృశ్యమైంది.. తల్లిదండ్రులు, పోలీసులు ఎంతగా వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు.. చివరకు ఆదివారం ఉదయం వేగంగా వెళుతున్న ఓ బైక్ నుంచి కిందకు దూకి తీవ్ర గాయాలపాలైంది.. స్థానికులు ఆ బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు.. ఆ బాలిక మొహం, పెదవులపై పదికి పైగా కుట్లు పడ్డాయి.. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు. ఆ బాలికపై జరిగిన ఘాతుకం గురించి విని షాకయ్యారు. 


ఇది కూడా చదవండి..

Karnataka: మరో మూడు రోజులే గడువు.. రూ.60 వేల జరిమానా కట్టాల్సిందేనంటూ ఒత్తిడి.. ఇంతకీ ఆ దళిత కుటుంబం చేసిన తప్పేంటంటే!


రాజస్థాన్‌ (Rajasthan)లోని కోటకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పది రోజుల క్రితం పాఠశాల నుంచి అదృశ్యమైంది. ఆమె గత కొద్ది రోజులుగా ఇంటర్మీడియెట్ చదువుతున్న వ్యక్తితో స్నేహం చేస్తోంది. అతడిని నమ్మి అన్ని విషయాలు పంచుకుంటోంది. అతడి ప్రేమలో పడింది. పది రోజుల క్రితం ఆ యువకుడు ఆ బాలికను తనతో పాటు తీసుకెళ్లాడు. మాయ మాటలు చెప్పి రైలు ఎక్కించి కోటలోని తన స్నేహితుల గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికపై ఐదుగురు యువకులు మూడ్రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 


ఆ బాలిక ఎంతగా విలపించినా వారు వినిపించుకోలేదు. చివరకు ఆదివారం రాత్రి బైక్‌పై వేరే ప్రాంతానికి తీసుకెళ్తుండగా ఆ బాలిక దూకేసింది. వారు ఆ బాలికను పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాల పాలైన ఆ బాలికను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించిన తర్వాత వైద్య సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించారు. 

Read more