అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకున్న చిన్నారి అన్నయ్య... ఎలా మురిసిపోతున్నాడో చూడండి!

ABN , First Publish Date - 2022-10-02T16:20:49+05:30 IST

ఇంటిలో చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబంలోని...

అప్పడే పుట్టిన తమ్ముడిని ఎత్తుకున్న చిన్నారి అన్నయ్య... ఎలా మురిసిపోతున్నాడో చూడండి!

ఇంటిలో చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబంలోని పెద్ద పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అటువంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఒక నవజాత శిశువును తన ఒడిలోకి తీసుకున్న అన్నయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్విట్టర్ అకౌంట్ @TansuYegenలో షేర్ చేసిన ఈ వీడియోలో ఈ అమాయకపు పిల్లల భావాలను చూసిన ఎవరైనా భావోద్వేగానికి లోనవుతారు. 


అప్పుడే పుట్టిన తమ్ముడిని ఆ చిన్నారి తన ఒడిలోకి తీసుకున్న వెంటనే భావోద్వేగానికి లోనయ్యాడు. అతని కళ్ళు చెమర్చాయి. కన్నీటిని తుడుచుకుంటూనే సోదరుడిని కౌగిలించుకున్నాడు. హృదయానికి హత్తుకునే ఈ వీడియోకు 1.60 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. వైరల్ వీడియోలో ఒక అందమైన చిన్న పిల్లవాడు తన ఒడిలోకి నవజాత శిశువును తీసుకున్నాడు. ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తి చేయాలో, ఆ శిశువును ఎలా లాలించాలో అన్నయ్యకు అర్థం కాలేదు. ప్రేమతో నిండిన కళ్లతో తమ్ముడిని అలా చూస్తూనే కూర్చున్నాడు. ఈ పిల్లల ఈ అమాయకపు భావాలు చూసిన ఎవరైనా ఎమోషనల్ కాకుండా ఉండలేకపోతున్నారు. 

Read more