ఏడు నెలలుగా తండ్రి చేసిన దారుణం... చివరికి కూతురు గర్భం దాల్చడంతో..

ABN , First Publish Date - 2022-10-01T03:30:30+05:30 IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కూతురిపై కన్నేశాడు. కలలో కూడా ఏం తండ్రీ చేయని దారుణం చేశాడు. సుమారు ఏడు నెలలుగా ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పుకోలేని...

ఏడు నెలలుగా తండ్రి చేసిన దారుణం... చివరికి కూతురు గర్భం దాల్చడంతో..

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కూతురిపై కన్నేశాడు. కలలో కూడా ఏం తండ్రీ చేయని దారుణం చేశాడు. సుమారు ఏడు నెలలుగా ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పుకోలేని కూతురు లోలోపలే కుమిలిపోయింది. అయితే చివరకు ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలియగానే ఆమెకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. చివరకు శిశుసంక్షేమశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. శాడిస్తు తండ్రికి శిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్చు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..


కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి గర్భవతిని చేసిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడైన తండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ తండ్రి కన్న కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. మాతా శిశుసంక్షేమశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌పటేల్‌ ఆదేశాలతో దేవీపట్నం ఎస్‌ఐ కేవీ నాగార్జున కేసు నమోదు చేశారు. కోర్టులో వాదోపవాదనలు పూర్తయిన అనంతరం జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎల్‌.వెంకటేశ్వరరావు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారని ఎస్‌ఐ నాగార్జున తెలిపారు.

పెళ్లి మంటపంలో వరుడి ముందే.. స్నేహితులతో కలిసి గదిలోకి వెళ్లిన యువతి.. కాసేపటికి అంతా షాకయ్యేలా...Read more