7 Of India’s Biggest Murder Mysteries: భారతదేశంలో సంవత్సరాల తరబడి సాల్వ్ కాని బిగెస్ట్ మర్డర్ కేసులు..

ABN , First Publish Date - 2022-09-28T14:12:35+05:30 IST

సంవత్సరాల తరబడి మలుపులు, అనుమానాస్పద సాక్ష్యాలు, ప్రముఖ వ్యక్తులు ఈ హత్యలు భారతదేశంలోనే సంచలనంగా మారి చరిత్రలో మిగిలిపోయిన కొన్ని ముగింపు లేని కథలు.

7 Of India’s Biggest Murder Mysteries: భారతదేశంలో సంవత్సరాల తరబడి సాల్వ్ కాని బిగెస్ట్ మర్డర్ కేసులు..

సంవత్సరాల తరబడి మలుపులు, అనుమానాస్పద సాక్ష్యాలు, ప్రముఖ వ్యక్తులు ఈ హత్యలు భారతదేశంలోనే సంచలనంగా మారి చరిత్రలో మిగిలిపోయిన కొన్ని ముగింపు లేని కథలు. 


1. సునంద పుష్కర్..

భారత రాజకీయవేత్త శశి థరూర్ భార్య సునంద పుష్కర్. పాకిస్థానీ జర్నలిస్ట్ మెహర్ తరార్ తన భర్తను వెంబడించాడని ఆమె ఆరోపించిన ట్విట్టర్ వివాదం తర్వాత ఆమె ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లోని 345 గదిలో శవమై కనిపించింది. శశి సునంద నిద్రపోతుందనుకున్నాడు. లేవకపోయే సరికి పోలీసులకు సమాచారం అందించాడు. ప్రాథమిక నివేదికలు ఆత్మహత్యగా చెప్పినప్పటికీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు గాయం గుర్తులను క్లెయిమ్ చేసారు. తర్వాత డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణింంచారని తేల్చారు. జనవరి 6, 2015న సునంద హత్యకు గురైందని ఢిల్లీ పోలీసులు నివేదిక అందించారు.


2. అరుషి తల్వార్..

గొంతు కోసి దొరికిన 14 ఏళ్ళ ఆరుషి తల్వారా హత్య కేసు దర్వాప్తు సంవత్సరాల తరబడి మలుపులు తిరిగింది. ఇంట్లో పనివాడు హేమరాజ్ పై మొదట ఆరోపణలు ఉండగా అతని మృతదేహం కూడా కొద్దిరోజుల్లోనే కనుగొన్నారు. చాలా కాలం విచారణ తరువాత సాక్ష్యాలు గందరగోళం, తల్లిదండ్రులు రాజేష్, నూపుర్ తల్వార్ పరిశోధకులను తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కున్నారు. చివరికి కోర్ట్ తల్లిదండ్రులనే దోషులుగా నిర్థారించింది.


3. జెస్సికా లాల్..

నో వన్ కిల్డ్ జెస్సికా 2006 ఒక వార్తా కథనం వచ్చింది. నిందితుడు మను శర్మ, జెస్సికా లాల్ హత్యలో అతనికి ప్రమేయం ఉందని. బార్ లో ఆల్కహాల్ అయిపోవడంతో జెస్సికా తనకు మద్యం అందించడానికి నిరాకరించడంతో అతను కాల్చి చంపాడు. ఎందరో ప్రముఖ వ్యక్తులతో కేసులో ప్రమేయం ఉన్నప్పటికీ మను శర్మ నిర్దోషి అని ప్రకటించిన తర్వాత జనం నుంచి వచ్చిన తీవ్రమైన వెతిరేకతతో నిరసనలు ఢిల్లీ హైకోర్డ్ ఈ విషయాన్ని తిరిగి విచారించడానికి కారణమైంది. 25 రోజుల పాటు రోజువారీ విచారణ తర్వాత మను శర్మను దోషిగా నిర్థారిస్తూ ఢిల్లీ హైకోర్ట్ తీర్పును ఇచ్చింది. 


4. నిఠారీ హత్య కేసు..

సురీందర్ కోలీ నోయిడాకు చెందిన వ్యాపారవేత్త మోనీందర్ సింగ్ పంధేర్ ఇంట్లో పనివాడు. 2006లో నోయిడా శివార్లలోని నిథారి గ్రామంలో తప్పిపోయిన పిల్లల పుర్రెల విషయంలో వీళ్ళ ఇద్దరినీ అరెస్ట్ చేసారు. అసలు ఏం జరుగుతోందన్న దానిపై మీడియాలో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఈ కేసు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమైంది. అత్యాచారం, నరమాంస భక్షకం, పెడోఫిలియా. స్వలింగ సంపర్కం, అవయవాల అక్రమ రవాణా లాంటి ఆరోపణలు ఉన్నాయి. సురీందర్ కోలీ 5 నరహత్యలకు పాల్పడ్డాడు. మరణశిక్ష విధించారు. అదే విచారణలో 11 పరిష్కారం కాని హత్యలతో పంధర్ తన తీర్పుకోసం ఎదురుచూస్తున్నాడు. 


5. నితీష్ కటారా..

నితీష్ కటారా ఢిల్లీలో 25 ఏళ్ళ పాటు బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసాడు. 2002లో నేరస్థుడు, రాజకీయ నాయకుడు డి.పి. యాదవ్ వారసుడు వికాస్ యాదవ్ చేత హత్య చేయబడ్డాడు. తన క్లాస్ మేట్ భారతి నుంచి విడిపోవాలని అనేకసార్లు బెదిరించినా అది పట్టించుకోని కారణంగా నితీష్ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం హైవే పక్కన కనిపించింది. సుత్తితో తలమీద మోది డీజిల్ తో నిప్పు పెట్టారు. ట్రయిల్ కోర్ట్ తీర్పు ప్రకారం నితీష్ హత్య పరువు హత్యగా గర్తించారు. 


6. నైనా సాహ్ని తాండూర్ హత్య..

భయంకరంగా తాండూర్ హత్య జరిగింది. నైనా సాహ్ని తన భర్త చేతిలో చనిపోయింది. సాక్ష్యాధారాలను పాడుచేయాలనే ఉద్దేశ్యంతో మృతదేహాన్ని నరికి ఢిల్లీ రెస్టారెంట్ లోని తాండూర్ మట్టిపొయ్యిలో ఉంచారు. ఆమె భర్త కాంగ్రెస్ ఎమ్మెల్యే సుశీల్ శర్మ 18 ఏళ్ళ తర్వాత హత్యకు పాల్పడ్డారు. 


7. సైనైడ్ మల్లిక..

భారతదేశంలోనే మొదటి మహిళా సీరియల్ కిల్లర్ గా పేరుపొందింది. దేవాలయాల దగ్గర ఉన్న మహిళా భక్తుల దగ్గర పరమ భక్తురాలిగా నటిస్తూ బాగా డబ్బున్న స్త్రీలతో స్నేహం చేసేది. ఆమెను నమ్మిన భక్తురాళ్ళను దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి సైనెడ్ కలిపిన మంత్రజలం తాగమని, ప్రసాదం తినమని ఇచ్చి ఆరుగురు మహిళలను చంపింది. మల్లికకు 2010లో మరణశిక్ష విధించింది. తర్వాత 2012లో జీవిత ఖైదుగా మార్చారు. 

Read more