100 బొద్దింకలను ఇంట్లోకి రానిస్తే.. లక్షన్నర రూపాయలు ఇస్తారట.. ఓ కంపెనీ వెరైటీ ఆఫర్..!

ABN , First Publish Date - 2022-06-23T21:43:59+05:30 IST

వివిధ కంపెనీలు వారి ప్రొడక్ట్స్‌ని విక్రయించే క్రమంలో వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం ఓ పెస్ట్ కంట్రోల్ కంపెనీ కూడా ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. 100 బొద్దింకలను ఇంట్లోకి రానిస్తే..

100 బొద్దింకలను ఇంట్లోకి రానిస్తే.. లక్షన్నర రూపాయలు ఇస్తారట.. ఓ కంపెనీ వెరైటీ ఆఫర్..!

వివిధ కంపెనీలు వారి ప్రొడక్ట్స్‌ని విక్రయించే క్రమంలో వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం ఓ పెస్ట్ కంట్రోల్ కంపెనీ కూడా ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. 100 బొద్దింకలను ఇంట్లోకి రానిస్తే.. లక్షన్నర రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇదేంటీ..! విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. అయితే కంపెనీ వారు ఇందుకు కొన్ని కండీషన్స్ పెట్టారు. వాటికి ఒప్పుకొంటేనే ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


యునైటెడ్ స్టేట్స్‌లోని నార్త్ కరోలినాకు చెందిన.. ది పెస్ట్ ఇన్ఫార్మర్ అనే సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. పెస్ట్ కంట్రోల్‌కు సంబంధించిన ప్రొడక్ట్‌ నాణ్యతను పరీక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఇంట్లోకి 100, అంతకంటే ఎక్కువ బొద్దింకలను ఇంట్లోకి వదులుతారు. అయితే ఇంటి యజమానులు.. 30రోజుల్లో పెస్ట్ నియంత్రణకు ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అలాగే బొద్దింకలను ఇంట్లోకి వదిలే ముందు ఇంటి యజమాని రాతపూర్వక ఆమోదాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 21ఏళ్ల వయస్సు దాటి ఉండాలి. దీనికి తోడు తప్పనిసరిగా కాంటినెంటల్ యునైటెడ్ స్టేట్స్ నివాసి అయి ఉండాలి.

రూ.93 కోట్ల ఆస్తికి వారసురాలు.. అయినా రూపాయి కూడా వాడుకోలేని స్థితి.. మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌తో..!


ఈ నిబంధనలన్నీ పాటించిన వారి ఇంట్లోకి 100 అమెరికన్ బొద్దింకలను వదలడంతో పాటూ రూ.1.5 లక్షలు అందజేస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బొద్దింకల నివారణకు తమ కంపెనీ కొత్త పద్ధతులను అవలంభిస్తోందని వ్యవస్థాపకుడు డేవిడ్ ఫ్లాయిడ్ తెలిపారు. ఐదు నుంచి ఏడు ఇళ్లలో బొద్దింకలను వదలనున్నట్లు చెప్పారు. ఇప్పటికే  2,200 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జూలై 31 వరకు సమయం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

రూ.10 నుంచి రూ.500 నోటు వరకు.. ఏ నోటును ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

Updated Date - 2022-06-23T21:43:59+05:30 IST