Viral News: షాకింగ్.. ఆవులు, గొర్రెలు ఉంటే రైతులు టాక్స్ కట్టాల్సిందేనట.. ఎక్కడో తెలుసా..?

ABN , First Publish Date - 2022-10-14T20:33:49+05:30 IST

ఆవులు, గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పర్యావరణం పేరుతో పన్నులు విధించేందుకు ప్రాణాళికలు రూపొందిస్తోంది. వినడానికి ఆశ్యర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే మన రాష్ట్రంలోనో, మన దేశంలోనో కాదండోయ్.

Viral News: షాకింగ్.. ఆవులు, గొర్రెలు ఉంటే రైతులు టాక్స్ కట్టాల్సిందేనట.. ఎక్కడో తెలుసా..?

ఇంటర్నెట్ డెస్క్: ఆవులు, గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పర్యావరణం పేరుతో పన్నులు విధించేందుకు ప్రాణాళికలు రూపొందిస్తోంది. వినడానికి ఆశ్యర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే మన రాష్ట్రంలోనో, మన దేశంలోనో కాదండోయ్.. న్యూజిలాండ్‌ సర్కారు ఈ దిశగా ఓ ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఆవులు, గొర్రెలను పెంపకందారులకు ట్యాక్స్ విధించే ప్రతిపాదనలను న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తోంది. వ్యవసాయ రంగం నుంచి వచ్చే గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుని అక్కడి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే 2025 నాటికి వ్యవసాయ రంగం నుంచి వచ్చే గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలను ఘననీయంగా తగ్గించాలని న్యూజిలాండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆవులు, గొర్రెల పెంపకందారులకు ట్యాక్స్ విధించాలనే ఆలోచన చేస్తోంది. 



గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలకు, ఆవులకు సంబంధం ఏంటంటే.. 

మిథేన్ అనేది ఒక గ్రీన్ హౌస్ వాయువు. గ్రీన్ హౌస్ వాయువులు గ్లోబల్ వార్మింగ్‌కు కారణం అవుతాయి. పర్యావరణం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వాతావరణ మార్పులకు కారణం అవుతాయి. కార్బన్ డై ఆక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ వాయువే అయినప్పటికీ.. దీని కంటే మీథేన్ 20 నుంచి 60 రెట్లు హానికరం. కాగా.. మీథేన్‌కు ఆవులకు, గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం ఏంటంటే.. ఇవి విడుదల చేసే గ్యాస్‌లో అధిక పరిమాణంలో ఈ వాయువు ఉంటుందట. తేన్పులు ఇచ్చినప్పుడు కూడా వాటి నుంచి మీథేన్ వాయువు వెలువడుతుందట. న్యూజిలాండ్‌లో సుమారు 60.2లక్షల ఆవులు ఉన్నాయి. వీటి నుంచి పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు విడుదలవుతున్న గుర్తించిన ప్రభుత్వం వాటి పెంపకం దారులపై పన్నులు విధించాలనే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జసిండా అర్డర్న్ కూడా స్పష్టం చేశారు. ఈ రకంగా వసూలు చేసిన డబ్బును తిరిగి రైతుల కోసమే ఖర్చు చేస్తామని తాజాగా ఓ సమావేశంలో చెప్పారు.


Updated Date - 2022-10-14T20:33:49+05:30 IST