Tamannah Bhatia Marriage: ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-06T15:38:42+05:30 IST

తమన్నా నటించిన తాజా చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. ఈ చిత్రం విడుదల సందర్భంగా తమన్నా ఆ చిత్ర విశేషాలను విలేకరులతో ముచ్చటించారు.

Tamannah Bhatia Marriage: ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు
Adivi Sesh, Tamannah, Satya Dev at the pre-release function of 'Gurtunda Seethakalam'.

ఒక స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ కొన కొనసాగిస్తూ ఒక పక్క పెద్ద బడ్జెట్ సినిమాలు పెద్ద హీరోల పక్కన చేస్తున్న తమన్నా, ఇంకో పక్క చిన్న హీరో అయినా సత్యదేవ్ లాంటి నటుడి పక్కన కూడా చేస్తూ వున్నారు. ఆలా ఆమె నటించిన తాజా చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకుడు. సత్యదేవ్, మేఘా ఆకాష్, కావ్య శెట్టి కూడా తమన్నా తో పాటు నటిస్తున్నారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా తమన్నా ఆ చిత్ర విశేషాలను విలేకరులతో ముచ్చటించారు. (Tamannah Bhatia is acting in a small film titled 'Gurthunda Seethakalam opposite Satya Dev')

mil-beauty2.jpg

ఇది కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' కి రీమేక్ సినిమా. అయితే ఈ రీమేక్ లో చెయ్యడానికి గల కారణాలను చెపుతూ, "రీమేక్ సినిమాలో నటించడం అనేది నాకు కొత్త కాదు. కానీ ఒరిజినాలిటీ ని మిస్ కాకుండా చాలెంజ్ లా తీసుకుని చేస్తాను ఎందుకంటే వాళ్లు అప్పటికే క్యారెక్టర్స్ చేసి ఉంటారు కాబట్టి చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఆ క్యారెక్టర్ చేయడం చాలెంజింగ్ గా తీసుకున్నాము," అని చెప్పింది తమన్నా. ఆమె ఈ సినిమా గురించి చెపుతూ మిగతా సినిమాలతో చూస్తే లవ్ స్టోరీస్ లలో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంచెం కష్టమే. "కానీ ఈ సినిమాలో నేను చేసిన ఎమోషన్స్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయి." అని అంటోంది. (This is a remake of Kannada film 'Love Mocktail')

ఈ సినిమా కథలో కథానాయకుడు చిన్నప్పటి నుంచి వయసులో వచ్చేవరకు తన జీవితం లో వచ్చిన ముగ్గురి కథానాయకుల గురించి ఉంటుంది. ఇలాంటి సినిమాలు చాల వచ్చాయి తెలుగులో, మరి ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటి ? "సినిమా ను పోలిన సినిమాలు వస్తుంటాయి కానీ అందులో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది ఇందులో కూడా కొత్త ఎమోషన్స్, కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు చెబుతున్నాము".

mil-beauty1.jpg

తమన్నా ఈ సినిమా సత్యదేవ్ తో నటించింది. అయితే అతనితో నటించటం చాల సంతోషంగా వుంది అని చెప్పింది. సత్యదేవ్ నటించిన 'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' సినిమా చూసిన తర్వాత ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్ గా అనిపించి అతనితో చెయ్యాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత ఈ సినిమా ఆఫర్ రావడంతో ఆ కోరిక తీరుతూ ఇద్దరూ కలసి మంచి ఎమోషన్ పండించడానికి అవకాశం దిరికింది, అని అంటోంది. హీరోల్లో పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలు చూడకుండా ఎవరితోనైనా సినిమాను

సినిమాగానే చేస్తాను అంటోంది. అయితే సినిమా కథ బాగుండాలి ఆ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని కోరుకుంటుంది తమన్నా. (I don't look at whether he is a big hero or small hero, I look at it as a cinema. Story should be good and audience should like it, says about doing film with small heros).

తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఇయర్స్ అయింది. అయినా ఇప్పటివరకు సినిమాపై ఉన్న క్రేజ్ ఆమెకి తగ్గలేదు అని చెప్తోంది. ఫస్ట్ వచ్చినప్పుడు సినిమాపై ఎలాంటి ప్యాషన్ ఉందో ఇప్పుడు అదే ప్యాషన్ తో పని చేస్తున్న అని అంటోంది. ఓటిటిలు వచ్చిన తరువాత రీమేక్ సినిమాల ప్రభావం తగ్గినా, మంచి సినిమా చూడ్డానికి అడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు అని అంటూ ఇప్పుడు ఆమె ఓటిటి లకు వర్క్ చేస్తోంది. యాక్టింగ్ పరంగా ఆమెకి ఇంకొక ప్లాట్ ఫామ్ దొరికిందని తమన్నా చెప్పింది.

mil-beauty3.jpg

'గుర్తుందా శీతాకాలం' సినిమాను నాగార్జున నటించిన ప్రేమ కావ్యం 'గీతాంజలి' సినిమాలో పోలుస్తున్నారని అది ఆమెకి చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. "ఒక క్లాసిక్ సినిమాతో మా సినిమాను పోల్చినపుడు ఆ అంచనాలకు మేము రీచ్ అవుతాము అనే నమ్మకంతో ఉన్నాము," అని చెప్పింది. (This film is compared with the yesteryear classic 'Geethanjali' that stars Nagarjuna. Tamanna felt happy about it and confident that the film reach those expectations) పెళ్లి గురించి అడిగినప్పుడు, జనరల్ గా అందరి ఇళ్లలో అమ్మాయిలకుపెళ్లి గురించి ప్రెజర్ వున్నట్లే తన ఇంట్లో కూడా ఆమెను ఎప్పట్నుంచో పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. "మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు," అని చెప్పింది. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్, రూమర్స్ గురించి ఎక్కువగా ఆలోచించను, అని చిపోండి. "ఎందుకంటే అది వారి పార్ట్ ఆఫ్ లైఫ్, నటించడం అనేది మా లైఫ్. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ను అంత సీరియస్ గా తీసుకోను," అని చెప్పింది. (Like in every house my parents are also under pressure about my marriage and they are looking for a suitable person. I didn't take a decision yet as I focus on my career, says Tamannah)

Updated Date - 2022-12-06T15:47:31+05:30 IST