పళనిలో భక్తులకు ‘సుక్కు కాఫీ’

ABN , First Publish Date - 2022-11-29T11:09:19+05:30 IST

పళని మురుగన్‌ ఆలయంలో ప్రతిరోజు 5 వేల మంది భక్తులకు ‘సుక్కు కాపీ’ ఉచితంగా ఇస్తున్నారు. దిండుగల్‌(Dindugal) జిల్లా పళని దండాయుధపాణి స్వా

పళనిలో భక్తులకు ‘సుక్కు కాఫీ’

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 28: పళని మురుగన్‌ (Palani Murugan) ఆలయంలో ప్రతిరోజు 5 వేల మంది భక్తులకు ‘సుక్కు కాఫీ’ (Sukku Coffee) ఉచితంగా ఇస్తున్నారు. దిండుగల్‌ (Dindugal) జిల్లా పళని దండాయుధపాణి స్వామి ఆలయానికి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. శబరిమల (Sabarimala) సీజన్‌ కారణంగా ఆలయానికి వచ్చే అయ్యప్ప భక్తులు సంఖ్య వారం రోజులుగా పెరుగుతోంది. తెల్లవారుజామున 4.30 గంటలకు నుంచే భక్తులు కాలిబాటలో ఆలయానికి చేరుకుంటారు. అలా వచ్చే భక్తులు ఆకలితో ఆలయానికి వెళుతున్నారని భావించిన ఆలయ నిర్వాహకులు సుక్కు కాపీ అందించాలని నిర్ణయుంచారు. ఆ ప్రకారం, కాలిబాట మార్గంలోని ఇడుంబర్‌ ఆలయ సమీపంలో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు సుమారు 5 వేల మందికి కాపీ అందజేస్తున్నారు. సీజన్‌లో అదనంగా ఇస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2022-11-29T15:26:50+05:30 IST