ఈ స్కూల్‌కు వెళ్లాలంటే పుస్తకాలతో పాటు.. గొడుగులు కూడా తీసుకెళ్లాల్సిందే..!

ABN , First Publish Date - 2022-07-29T00:00:07+05:30 IST

అది ప్రభుత్వ పాఠశాల. సుమారు 200మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతకువరకూ బాగానే ఉన్నా.. విద్యార్థులు అక్కడ చదువుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే. రోజూ పాఠశాలకు..

ఈ స్కూల్‌కు వెళ్లాలంటే పుస్తకాలతో పాటు.. గొడుగులు కూడా తీసుకెళ్లాల్సిందే..!

అది ప్రభుత్వ పాఠశాల (Government school). సుమారు 200మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతకువరకూ బాగానే ఉన్నా.. విద్యార్థులు అక్కడ చదువుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే. రోజూ పాఠశాలకు వెళ్లాలన్నా పెద్ద సాహసం చేయాల్సి వస్తోంది. ఈ బడికి వెళ్లాలంటే పుస్తకాలతో పాటూ ఖచ్చితంగా గొడుగులు కూడా తీసుకెళ్లాల్సిందే. సమస్యలకు నిలయంగా మారిన ఈ పాఠశాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం సియోని పరిధి ఖైరికల గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో సమస్యలు తిష్టవేశాయి. ఇక్కడ సుమారు 200మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజనులు అధికంగా ఉండే ఈ గ్రామం లఖ్‌నాదౌన్ అసెంబ్లీ నియోజకవర్గం ( Assembly Constituency) పరిధిలోకి వస్తుంది. ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో తరచూ భవనం పైకప్పు పెచ్చులూడిపతుంటాయి. ఇటీవల చాలా మంది విద్యార్థులు పెచ్చులు మీద పడి గాయపడ్డారని పాఠశాల ఇన్‌చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు మహేంద్రశర్మ తెలిపారు. మరోవైపు హర్దాలోని రహత్‌గావ్ తహసీల్‌కు చెందిన వంగ్రాములకు చెందిన విద్యార్థులు పాఠశాలకు రావాలంటే నదిని దాటి రావాల్సి వస్తుంది.

Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..


వర్షాకాలంలో పాఠశాలకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు భవనం ఉరుస్తుండడంతో తరగతి గదుల్లోకి వర్షపు నీరు వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. గొడుగులు పట్టుకుని పాఠాలు వినాల్సి వస్తోందని తెలిపారు. పాఠశాల దుస్థితిపై పలుమార్లు జిల్లా అధికారులకు విన్నవించామని ఉపాధ్యాయులు తెలిపారు. భవనం మరమ్మతులకు త్వరలో నిధులు మంజూరవుతాయని, రాగానే మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలావుండగా, విద్యార్థులు నదిని దాటుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు.. ఇప్పుడు అతడికి ప్రతీ రోజూ రూ.2.40 లక్షలు.. అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు..!



Updated Date - 2022-07-29T00:00:07+05:30 IST