నాకెవరూ లేరు.. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతోనే ఉంటానంటే సరేనన్నాడా వ్యక్తి.. రెండో పెళ్లి చేసుకున్న 39వ రోజే..

ABN , First Publish Date - 2022-09-20T21:12:22+05:30 IST

ఆ వ్యక్తి వయసు దాదాపు 47 సంవత్సరాలు.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య నుంచి విడిపోయాడు..

నాకెవరూ లేరు.. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీతోనే ఉంటానంటే సరేనన్నాడా వ్యక్తి.. రెండో పెళ్లి చేసుకున్న 39వ రోజే..

ఆ వ్యక్తి వయసు దాదాపు 47 సంవత్సరాలు.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్య నుంచి విడిపోయాడు.. చాలా రోజులు ఒంటరిగానే ఉండిపోయాడు.. ఆ తర్వాత ఓ మహిళ అతడికి పరిచయమైంది.. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.. మాయ మాటలు చెప్పి అతడికి దగ్గరైంది.. దీంతో ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.. పెళ్లి జరిగిన 39వ రోజు ఆమె నిజ స్వరూపం బయటపడింది.. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు తీసుకుని పరారైంది.. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. 


ఇది కూడా చదవండి..

Viral: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఫోన్ చేయకండి.. షాక్ ఇస్తున్న మ్యాట్రిమోనియల్ సైట్ ప్రకటన!


ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి ఇద్దరు పిల్లలకు తండ్రి. మొదటి భార్య నుంచి విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఒంటరిగానే ఉన్నాడు. దాదాపు మూడేళ్ల క్రితం అతడికి రజనీ శర్మ అనే మహిళ పరిచయమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. క్రమంగా ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. చివరకు ఆగస్టులో రజనీ శర్మను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న నెల రోజుల తర్వాత అతడికి ఆమె షాకిచ్చింది. 


పెళ్లి జరిగిన 39వ రోజు రజినీ శర్మ భర్త ఇంట్లో ఉన్న రూ.25 లక్షల విలువైన నగలు, రూ.2 లక్షల నగదుతో ఇంటి నుంచి అదృశ్యమైంది. దీంతో పవన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రజినీ శర్మకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమెకు అంతకుముందే వివాహం జరిగిందని, భర్తతో కలిసి ప్లాన్ చేసి పవన్‌ను ట్రాప్ చేసినట్టు బయటపడింది. రజినీ, ఆమె భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.  


Read more