Snake vs Spider: పాము, సాలీడు.. ఈ రెండూ పోట్లాడితే గెలిచేది ఏది..? ఈ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..!

ABN , First Publish Date - 2022-09-17T20:46:26+05:30 IST

ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటే భయపడతారు. పాము ఉందని తెలిస్తే చాలు..

Snake vs Spider: పాము, సాలీడు.. ఈ రెండూ పోట్లాడితే గెలిచేది ఏది..? ఈ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..!

ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటే భయపడతారు. పాము ఉందని తెలిస్తే చాలు.. అటువైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. అయితే సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు చూసేందుకు మాత్రం ఆసక్తి చూపుతారు. ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఆ వీడియోలో ఓ పామును సాలెపురుగు ట్రాప్ చేసింది (Spider trapped the snake).


ఈ వీడియోను టెక్సాస్‌ (Texas)లో చిత్రీకరించారు. wildtrails.in ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. టెక్సాస్‌లోని ఓ కారు టైరుపై బ్లాక్ విడో స్పైడర్ (Black Widow spider) అల్లిన గూడులో నీటి పాము చిక్కుకుంది. అక్కడి నుంచి అది బయటపడలేకపోయింది. సుమారు రెండు అడుగులు ఉన్న ఆ పాముతో రెండు అంగుళాల సాలీడు పోరాటానికి దిగింది. ఈ వీడియో క్లిప్‌ను ఇప్పటివరకు 32 వేలకు పైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 


Read more