తల్లి అంత్యక్రియల్లో విషాదం: నీట మునిగిన ఇద్దరు కుమారులు, ఇద్దరు మనుమలు.. తరువాత ఏం జరిగిందో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-10-01T17:30:21+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

తల్లి అంత్యక్రియల్లో విషాదం: నీట మునిగిన ఇద్దరు కుమారులు, ఇద్దరు మనుమలు.. తరువాత ఏం జరిగిందో తెలిస్తే...

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన తల్లి అంతిమ సంస్కారాలు జరుగుతున్న సమయంలో చిన్న కుమారుడు మింటూ గంగా స్నానం కోసం నదిలో దిగి నీటి మునిగాడు. అతనిని రక్షించేందుకు ప్రయత్నించిన అతని సోదరుడు కమలేష్ కూడా నీటిలో మునిగాడు. వీరు మునిగిపోవడాన్ని గమనించిన అదే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు గంగా నదిలో దిగారు. ఆ నలుగురూ ప్రాణాపాయంలో చిక్కుకుని ఆర్తనాదాలు చేశారు. వీరిని చూసిన గజ ఈతగాళ్లు స్టీమర్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఒక గంటపాటు వెదుకులాట సాగగా... గజ ఈతగాళ్లు మింటూ, కమలేష్‌లను బయటకు తీసుకురాగలిగారు. అయితే నీట మునిగిన కమలేష్ ఇద్దరి కుమారుల జాడ తెలియరాలేదు. ఇంతలో చీకటిపడటంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. చూస్తుండగానే ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందడం స్థానికులకు కలచివేసింది. వివరాల్లోకి వెళితే బెహ్టా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న రాజా భార్య కన్నుమూయడంతో శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాల కోసం మృతదేహాన్ని నానామవూఘాట్ దగ్గరకు తీసుకు వచ్చారు. 


ఈ సమయంలో మృతురాలి చిన్నకుమారుడు మింటూ స్నానం చేసేందుకు గంగా నదిలో దిగాడు. పట్టుతప్పి నదిలో మునిగిపోయాడు. వెంటనే అతని సోదరుడు కమలేష్ అతనిని రక్షించేందుకు గంగా నదిలోనికి దిగాడు. అతనూ నీట మునిగాడు. వీరిద్దరూ నీట మునగడాన్ని చూసిన కమలేష్ కుమారులు ఆకాష్, రాకేష్ తమ తండ్రి, చిన్నాన్నలకు కాపాడేందుకు గంగా నదిలో దిగారు. వారు నలుగురూ ఒక్కొక్కరుగా గంగానదిలో మునిగిపోయారు. వారంతా తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయడంతో అక్కడున్న గజఈతగాళ్లు వారి కోసం గాలింపు చేపట్టారు. మింటూ, కమలేష్‌లను రక్షించిన ఈతగాళ్లు ఆకాష్, రాకేష్‌ల జాడ కనుగొనలేకపోయారు. ప్రస్తుతం వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 



Updated Date - 2022-10-01T17:30:21+05:30 IST