Viral News: 11ఏళ్ల బుడ్డొడి అదిరిపోయే పర్ఫామెన్స్.. హోం వర్క్ తప్పించుకోవడానికి ఇలాంటి రీజన్ మీరు అస్సలు చెప్పి ఉండరు!

ABN , First Publish Date - 2022-09-16T17:23:52+05:30 IST

ఉదయాన్నే నిద్ర లేచి స్కూల్ వెళ్లడం అంటే కొందరు పిల్లలకు సాధారణంగానే చిరాకు. ఇటువంటి వారితో హోం వర్క్ చేయించడం అంటే చాలా కష్టం. అయితే.. ఇప్పుడు చిన్న పిల్లల హోం వర్క్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఓ 11 ఏళ్ల బుడ్డోడు తన వర్క్‌

Viral News: 11ఏళ్ల బుడ్డొడి అదిరిపోయే పర్ఫామెన్స్.. హోం వర్క్ తప్పించుకోవడానికి ఇలాంటి రీజన్ మీరు అస్సలు చెప్పి ఉండరు!

ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే నిద్ర లేచి స్కూల్ వెళ్లడం అంటే కొందరు పిల్లలకు సాధారణంగానే చిరాకు. ఇటువంటి వారితో హోం వర్క్ చేయించడం అంటే చాలా కష్టం. అయితే.. ఇప్పుడు చిన్న పిల్లల హోం వర్క్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఓ 11 ఏళ్ల బుడ్డోడు తన వర్క్‌ను తప్పించుకోవడానికి అద్భుతమైన పర్ఫామెన్స్ చేశాడు. బహుశా ఇప్పటి వరకు అటువంటి కారణాన్ని ఏ పిల్లాడు చెప్పకపోయి ఉండొచ్చు. ప్రస్తుతం ఆ చిన్నోడికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



చైనాకు చెందిన 11 ఏళ్ల(11years old boy) చిన్నోడికి.. తన తల్లి హోమ్ వర్క్ చేయాలని సూచించింది. ఈ క్రమంలో స్పందించిన బుడ్డోడు.. వర్క్ తప్పించుకోవడానికి అద్భుతమైన ఐడియా వేశాడు. స్కూల్ బుక్స్(school books) నుంచి వచ్చే వాసన తనకు పడదని.. ఎలర్జీ కారణంగా కళ్లలోంచి నీళ్లు కూడా కారుతాయని చెప్పాడు. అందుకు తగినట్టే ఓ టిష్యూ పేపర్‌ను మడిచి.. తన ముక్కు వద్ద పెట్టుకన్నాడు. అంతేకాదు.. కళ్లలోంచి నీళ్లు కార్చాడు. కొడుకు నుంచి వచ్చిన సమాధానం విని షాకైన తల్లి.. ‘ఇంత కాలం లేని ఎలర్జీ(allergic) ఇప్పుడెలా వచ్చిందంటూ’ తిరిగి ప్రశ్నిస్తుంది. దీంతో మరోసారి స్పందించిన ఆ బుడతడు.. తన సమాధాన్ని సమర్థించుకుంటూ.. గత ఐదేళ్లుగా ఇలాగే జరుగుతుందని.. కానీ తానే గుర్తించలేకపోయానంటూ వాపోయాడు. అయితే.. కొడుకు వేస్తున్న వేషాలు గుర్తించిన ఆ తల్లి.. నాటకాలు ఆపి హోమ్ వర్క్(home work) చేయాలంటూ చిన్నోడికి సూచించింది. దీనికి సంబంధించిన వార్తను స్థానిక మీడియా సంస్థ ప్రచురించగా.. ప్రస్తుత అదికాస్తా వైరల్‌(viral)గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆ బుడ్డోడి తెలివికి హ్యాట్సాఫ్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 


Updated Date - 2022-09-16T17:23:52+05:30 IST